Onion Chopping Without Tears: ఉల్లిపాయ కోసేప్పుడు కంటి నీరు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!
Onion Chopping Without Tears: సాధారణంగా ఉల్లిపాయలు కట్ చేయడం వల్ల కంటి నుంచి నీరు రావడం సహజం. ఉల్లిపాయ కట్ చేసే సమయంలో దానిలోని రసాయన వాయువు వల్ల కన్నీటి నుంచి నీరు వస్తుంది. అయితే అలా కన్నీరు రాకుండా ఉండేందుకు ఓ మహిళ సాధారణ టిప్ చెప్పింది. అదేంటో తెలుసుకుందాం.
Onion Chopping Without Tears: ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నుంచి నీళ్లు రావడం సహజం. ఇలా ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి కారణం ఉంది. ఇది ఉల్లి నుంచి విడుదలయ్యే రసాయనం. ఈ రసాయనం కళ్లలోకి వెళితే కంటిలో నీరు ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు ఓ మహిళ పరిష్కారం కనుగొంది. ఈ ఉపాయం ఉపయోగించి, మీరు కంటికి నీళ్లు రాకుండా అడ్డుకోవచ్చు.
ట్రినా మిచెల్ అనే మహిళ ఫేస్‌బుక్‌లో ఈ ఆలోచనను పంచుకుంది. మహిళ ప్రకారం.. ఉల్లిపాయను కట్ చేసినప్పుడు.. దాని నుండి వచ్చే రసాయనం నుండి కంటిలో నీరు వస్తుంది. ఎందుకంటే ఉల్లి నుంచి వచ్చే రసాయనం కళ్లలోని నీళ్లతో కలిసిపోవడంతో కంటి మంట ప్రారంభమవుతుంది. దీంతో అది కన్నీరుకు కారణమవుతుంది.
ఉల్లిపాయలను కట్ చేసేప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే.. మనం ఆ రసాయనం కంటిలోకి ఆవిరి తగలకుండా నివారించుకోవాలి. అంటే ఉల్లిపాయను కోసే ముందు పేపర్ టవల్ ను నీటిలో తడిపి దాన్ని ఉల్లిపాయలపై చుట్టాలి. ఆ తర్వాత దాన్ని చిన్న పాత్ర తీసుకొని.. అందులో నీటిని పోసి నింపాలి. అలా నీటిలో నానబెట్టిన కొద్దిసేపటి తర్వాత ఉల్లిపాయలను తీసి కట్ చేయోచ్చు. అలా చేయడం వల్ల కంటి నుంచి నీరు కారదు.
Also Read: Mothers Day 2022: మదర్స్ డే స్పెషల్ విషెస్.. ఈ రోజంతా అమ్మతోనే సరదాగా గడిపేద్దాం!
Also Read: Weight Loss Yoga: ఈ యోగాసనంతో అధిక బరువు, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.