Penu korukudu: ఆధునిక కాలంలో చాలా మంది జుట్టు సమస్యతో బాధపడుతుంటారు. జట్టు రాలడం కారణంగా తీవ్ర ఆందోళన చెందుతారు. శరీరంలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, పొల్యూషన్, ఆహార అలవాట్లు మారడం ద్వారా ఈ సమస్య మొదలవుతుందన్ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది పేను కొరుకుడు సమస్యతో బాధపడుతుంటారు. దీని వల్ల బట్టతల సమస్యలు వస్తుంది అని అపోహపడుతుంటారు. పేను కొరుకుడు అంటే ఎంటీ..? ఈ సమస్య నుంచి ఉపశమనం ఎలా పొందవచ్చు అనే ఆంశంపై తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేను కొరుకుడు అంటే?


పేను కొరుకుడు  అనేది.. తల మీద ఉన్న వెంట్రుకలను కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తుంది. అలర్జీ కారణంగా ఈ పేను కొరుకుడు జరుగుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.  అయితే ఈ సమస్య వచ్చినప్పుడే తగిన పరిష్కారాలు పాటించడం వల్ల తిరిగి చుట్టు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ చెప్పిన చిట్యాల ద్వారా పేను కొరుకుడు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


1. తగిన వైద్యం:  పేను కొరుకుడు సమస్యతో బాధపడుతున్నవారు ఎంతో జాగ్రతగా ఉండాలి. ముందుగా  హేర్ కేర్ నిపుణులు  చెప్పిన సూచనలను పాటించాల్సి ఉంటుంది. వారు చెప్పిన మందులను తప్పకుండా వాడడం ద్వారా తర్వగా ఉపశమనం పొందవచ్చు. 


2. ఎర్ర మందారం:  ఎర్రమందార పూవులు వాడటం వల్ల పేను కొరుకుడు సమస్య నుంచి బయటపడవచ్చు.  పేనుకొరుకుడు ఉన్న  చోట మందారాన్ని రాసుకోవడం ద్వారా త్వరలో కొత్త జుట్టుగా పొందవచ్చు. 


Also Read: Carrots Benefits: ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే క్యారెట్‌ను వదలకుండా ప్రతిరోజు తింటారు..


3. జిల్లేడు పాలు:  జిల్లేడు పాలు పేనుకొరుకుడు సమస్యను నివారిస్తుంది. అయితే ఇది వాడేటప్పుడు మీ చేతులు, కళ్ళకు తాకకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


4. కెమికల్స్ లేని షాంపు: కెమికల్స్‌తో కూడిన షాంపూని కారణంగా సమస్య ఎక్కువుతుందని నిపుణులు అంటున్నారు. కెమికల్స్ లేని షాంపూని వాడటం వల్ల పేను కొరకుడు తగ్గిపోతుందని చెబుతున్నారు.


Also Read: Skin Care Tips: చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇలా చేయండి.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి