Skin Care Tips: చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇలా చేయండి.

Skin Care Tips: ప్రస్తుత జీవనశైలిలో చర్మంపైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అప్పుడే చర్మ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ సమస్యలకు కారణాలు ఎంటి..? ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా మారుతుందా..? అనే అంశం మీద ఆయుర్వేద నిపుణుల పలు సలహాలు, సూచనలను వివరించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 02:44 PM IST
Skin Care Tips: చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇలా చేయండి.

Skin Care Tips: ఆధునిక జీవనశైలిలో చర్మ సంరక్షణ ఎంతో ముఖ్యమని  ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలకు మూల కారణం హానికారమైన యూవీ రేస్‌, వాతావరణ కాలుష్యం, బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఎక్కువగా వినియోగించడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్య పరీక్ష పరిశీలనలో రుజువైంది. అంతేకాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా చర్మ సమస్యలకు దారి తీస్తుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి.

చర్మ సమస్యలు తరుచుగా శరీరంలోని వాత, పిత్త, కఫ మార్పుల కారణంగా సంభవిస్తాయని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. ఇవి శరీరంలో తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు పలు అనారోగ్య సమస్యలు వస్తాయని.. వాటిలో ఒకటి చర్మ సమస్య వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. మరీ ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడతదు అనే అంశంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం

పిత్త సమస్యలు ఉన్నవారు..  

పుల్లటి అహార పదార్థాలు అధికంగా తినకూడదు. ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం.. నిమ్మకాయ, చింతపండు, ఉసిరికాయ  లాంటి  పుల్లని రుచి కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పిత్త లక్షణాలు వేగంగా పెరుగుతాయి. దీని వల్ల  విపరీత్తంగా దురద, మొటిమల సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: AP Elections 2024: ఫిబ్రవరి మొదటి వారంలో ఏపీ ఎన్నికల నోటిపికేషన్, ఏప్రిల్ నాటికి దేశంలో ఎన్నికలు పూర్తి

వాత సమస్యలు ఉన్నవారు..

వాత సమస్య కారణంగా సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఇలాంటి సమయంలో గ్లూటెన్ ఉన్న ఆహారాల పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. లేదంటే సమస్య మరింతగా పెరగవచ్చని సూచిస్తున్నారు.

కఫ  సమస్య ఉన్నవారు..

శీతాకాలంలో కఫ సమస్యలు అధికంగా పెరుగుతాయి. చలికాలంలో వచ్చే వాతావరణ మార్పులతో పాటు ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణమంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు శీతాకాలంలో పాలతో తయారు చేసే ప్రొడక్ట్స్‌లకు దూరంగా ఉండటం ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు

Also Read: Ysr Congress Party: వైసీపీలో కఠిన నిర్ణయాలు, 11 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీల మార్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News