Which Facial At Home: అందంగా ఉండాలి అని ఆశించని వ్యక్తి ఉండరు. ఎప్పటికప్పుడు అందంగా కనిపించడం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం. సోషల్ మీడియాలో కనిపించే రకరకాల బ్యూటీ టిప్స్ కూడా ఫాలో అవుతాం. అయితే ఎన్ని చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క వస్తువుని ఉపయోగించి మనం మొటిమల దగ్గర నుంచి చర్మ సమస్య వరకు ..జుట్టు సమస్య నుంచి స్కిన్ టానింగ్ వరకు అన్ని తగ్గించుకోవచ్చు అని మీకు తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వస్తువు మన వంటింట్లో సులభంగా దొరికే రైస్ వాటర్. ఈ రైస్ వాటర్ వినియోగం ఆసియా దేశాలలో ఎక్కువగా వాడుతుంటారు.. మరి ముఖ్యంగా కొరియా లాంటి దేశాలను బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా రైస్ వాటర్ ని ఉపయోగిస్తారు. మీ చర్మ ఆరోగ్యానికి ఎంతో అద్భుతంగా సహాయపడే ఈ రైస్ వాటర్ ఎలా చేసుకోవాలి? ఎలా వాడాలి అనే విషయాలు తెలుసుకుందాం.



హెయిర్ కండీషనర్


జుట్టు మృదువుగా ఉండడం కోసం హెయిర్ కండీషనర్‌ ఉపయోగిస్తాము .అయితే ఎక్కువ కెమికల్స్ ఉన్న హెయిర్ కండిషనర్ ఉపయోగించడం వల్ల క్రమంగా జుట్టు డ్రై గా మారిపోతుంది. సహజంగా ఇంటి వద్దనే జుట్టు ను ఎంతో మృదువుగా ఉంచుకోవడం కోసం రైస్ వాటర్ ని ఉపయోగించవచ్చు. రైస్ వాటర్ ని తలకు బాగా మసాజ్ చేసి ఒక అరగంట ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా మీ జుట్టు మృదువుగా మారుతుంది.


చర్మం సంరక్షణ


రైస్ వాటర్ ని మన ఫేస్ పై బాగా మసాజ్ చేసుకొని.. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల ముఖం మీద మచ్చలు ,మొటిమలు క్రమంగా తగ్గడంతో పాటు మీ మేని ఛాయ కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉన్న ఆంటీ ఆక్సిడెంట్ తత్వాలు చర్మం మీద పలు రకాల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతాయి. రైస్ వాటర్ చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని డీప్ గా మాయిశ్చరైజ్ చేసి చాలా రిఫ్రిషింగ్ లుక్ ఇస్తుంది.


రైస్ వాటర్ తయారీ


బియ్యం ఒకసారి కడిగిన తర్వాత మళ్లీ కొంచెం నీళ్లు పోసి అరగంట పాటు నానపెట్టాలి. ఇప్పుడు ఇలా నానబెట్టిన నీటిని జాగ్రత్తగా వడకట్టుకొని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ వాటర్ ను ప్రతిరోజు ఫ్రెష్ గా చేసుకోవచ్చు లేక ఫ్రిజ్లో ఒక రెండు మూడు రోజులు నిలువ పెట్టుకోవచ్చు.


Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?


Also Read: Revanth Is Lilliput: 'రేవంత్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌': కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter