Monsoon Skin Care: వర్షాకాలంలో ఆరోగ్యం, అందం రెండింటి పట్ల సంరక్షణ చాలా అవసరం. ముఖ్యంగా చర్మం గురించి కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవల్సిందే. వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి..ఆ వివరాలు మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మ సంరక్షణ అనేది ప్రతి సీజన్‌లోనూ ముఖ్యమే. ఎండాకాలంలో ఎండల్నించి, చలికాలంలో చలి నుంచి కాపాడుకోవల్సి వస్తే..వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకోవాలి. ఆరోగ్యం, అందం రెండింటినీ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చర్మ సంరక్షణ అంటే మార్కెట్‌లో లభించే వస్తువులతో కాకుడా సహజసిద్ధమైన ఉత్పత్తులతో అంటే హోమ్ రెమిడీస్‌తో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలుంటాయి. అంటే చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడేది పెరుగు. ముఖానికి క్రమం తప్పకుండా పెరుగు రాయడం వల్ల..చర్మానికి నిగారింపు వస్తుంది. అందం పెరుగుతుంది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏలు ఉంటాయి.ఇవి చర్మాన్ని ఆయిల్ ఫ్రీ చేస్తాయి. అందుకే వర్షాకాలంలో ముఖంపై తప్పకుండా పెరుగు రాయాలి. ఇతర లాభాలేంటో చూద్దాం..


వర్షాకాలంలో చర్మానికి వివిధ రకాలుగా హాని కలిగే అవకాశాలున్నాయి. ముఖంపై మచ్చలు, మరకలు, పింపుల్స్ ఏర్పడి ఇబ్బంది కల్గిస్తుంటాయి. వీటిని దూరం చేసేందుకు పెరుగు, నిమ్మ మిశ్రమాన్ని వినియోగించాలి. ఓ చిన్న గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కొద్గిగా నిమ్మరసం కలపాలి. ముఖంపై ప్రతిరోజూ ఓ 20 నిమిషాలు పెట్టుకుని..తరువాత చల్లని నీటితో కడిగేయాలి.


వర్షాకాలంలో స్కిన్ ఎలర్జీ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బ్లేర్‌హెడ్స్, డ్రైనెస్ సమస్యలు తలెత్తుతాయి.పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. పెరుగుతో చర్మానికి నిగారింపు వస్తుంది. దీనికోసం పెరుగు, శెనగపిండి స్క్రాబ్ తయారు చేసుకోవాలి. ఓ గిన్నెలో 2 స్పూన్స్ పెరుగు తీసుకుని అందులో ఒక స్పూన్ శెనగపిండి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని పదినిమిషాల తరువాత కడిగేయాలి. 


Also read: Amla Benefits: ఉసిరిని ఇలా వండుకుని తింటే అద్భుత ప్రయోజనాలు, మధుమేహానికి దివ్య ఔషధం



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook