Amla Benefits: ఉసిరిని ఇలా వండుకుని తింటే అద్భుత ప్రయోజనాలు, మధుమేహానికి దివ్య ఔషధం

Amla Benefits: ఉసిరి ఉపయోగాలు వింటుంటే ఆశ్చర్యమేస్తుంది. తల వెంట్రుకల్నించి..కాలి గోటి వరకూ..ఇమ్యూనిటీ సైతం పంచుతుంది ఉసిరి. డయాబెటిస్ రోగులకు ఉసిరి ఎంతవరకూ లాభం చేకూరుస్తుందో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 21, 2022, 06:12 PM IST
Amla Benefits: ఉసిరిని ఇలా వండుకుని తింటే అద్భుత ప్రయోజనాలు, మధుమేహానికి దివ్య ఔషధం

Amla Benefits: ఉసిరి ఉపయోగాలు వింటుంటే ఆశ్చర్యమేస్తుంది. తల వెంట్రుకల్నించి..కాలి గోటి వరకూ..ఇమ్యూనిటీ సైతం పంచుతుంది ఉసిరి. డయాబెటిస్ రోగులకు ఉసిరి ఎంతవరకూ లాభం చేకూరుస్తుందో తెలుసుకుందాం.

విటమిన్ సి సమృద్ధిగా లభించే ఏకైక పదార్ధం ఉసిరికాయలు. ఉసిరి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. తల వెంట్రుకల్నించి ఇమ్యూనిటీ వరకూ ఉసిరి తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అటు డయాబెటిస్ రోగులకు కూడా ఉసిరి వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. డయాబటిస్ రోగుల్లో హఠాత్తుగా కన్పించే స్పైక్స్‌ను ఉసిరి నియంత్రిస్తుంది. దాంతోపాటు డయాబెటిస్ రోగుల్లో మెటబోలిజంను మెరుగుపరుస్తుంది. ఇతర అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. ఇలా ఉసిరితో లెక్కకు మించిన లాభాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ఉసిరి తాలింపు

ముందుగా 7-8 ఉసిరికాయల్ని తీసుకుని ఉడికించాలి. చల్లారిన తరువాత గింజలు వేరు చేయాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1-2 పచ్చిమిర్చిలు తీసుకుని పాన్‌పై వేడి చేసి..దంచి పెట్టుకోవాలి. ఉడికించిన ఉసిరి ముక్కల్లో దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఒక స్పూన్ గానుగ నూనె కలపాలి. చివరిగా కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి తినాలి. 

మధుమేహం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ఉసిరిని మామూలుగా తినేకంటే ఇలా ఉసిరి తాలింపులా తీసుకుంటే..కళ్లపై డయాబెటిస్ ప్రభావం తగ్గుతుంది. ఇతర అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. ఉసిరి తాలింపులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగుల్లో కన్పించే కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. క్రమం తప్పకుండా ఉసిరి తాలింపు తీసుకోవడం వల్ల బాడీ మెటబోలిజం మెరుగౌతుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు. 

Also read: Cooking Oils: ఈ 5 రకాల వంట నూనెలతో హై కొలెస్ట్రాల్ బారిన పడే రిస్క్ తప్పుతుంది..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News