Pumpkin Seeds Face Pack for Remove Pimples, Acne & Wrinkles in 3 Weeks: ఈ ఫేస్‌ప్యాక్‌ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వాడటం ద్వారా పింపుల్స్, నల్లని మచ్చలు, ముడతలు అన్నీ దూరమౌతాయి. ఈ ఫేస్‌ప్యాక్ చేసేందుకు మీకు కావల్సింది కేవలం గుమ్మడికాయ గింజలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉందా.. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుమ్మడికాయ గింజల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషక గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే గుమ్మడికాయ గింజలు అటు ఆరోగ్యానికి సైతం చాలా మంచివి. గుమ్మడికాయ గుమ్మడికాయ గింజలతో చర్మ సంరక్షణ చేయవచ్చని చాలామందికి తెలియదు. ఈ విత్తనాలతో చేసే ఫేస్‌ప్యాక్ ద్వారా చర్మాన్ని పరిరక్షించుకోవచ్చు. ముఖంపై ఏర్పడే పింపుల్స్, మచ్చలు, ట్యానింగ్, నల్లటి మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు. ఫలితంగా మీ అందం మరింత పెరుగుతుంది. చర్మం నిగనిగలాడే కాంతిని పొందుతుంది.


గుమ్మడికాయ గింజలతో ఫేస్‌ప్యాక్ చేసే విధానం


ఈ సహజసిద్ధమైన హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు గుమ్మడికాయ గింజలు, తేనె, యాపిల్ వెనిగర్ కావల్సి వస్తాయి. ముందుగా గుమ్మడికాయ గింజల్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఇందులో కొద్దిగా తేనె, యాపిల్ వెనిగర్ కలపాలి. వీటన్నింటినీ కలిపి మరోసారి బ్లెండ్ చేయాలి. అంతే గుమ్మడికాయ గింజల ఫేస్‌ప్యాక్ రెడీ. 


గుమ్మడికాయ గింజల ఫేస్‌ప్యాక్ ఎలా వాడాలి..?


గుమ్మడికాయ గింజల ఫేస్‌ప్యాక్ రాసేముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పూర్తిగా రాయాలి. ఆ తరువాత 15-20 నిమిషాలకు ఉంచి ఆ తరువాత సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి 1-2 సార్లు ఈ ఫేస్‌‌ప్యాక్ వాడితే మంచి ఫలితాలుంటాయి. వివిధ కారణాలతో కోల్పోయిన నిగారింపు తిరిగి వస్తుంది. 2-3 వారాల్లోనే ముఖం కళకళలాడుతుంది. 


Also Read: White Hair Turn Black: 2 నిమిషాల్లో ఇలా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది! నమ్మట్లేదా, ఇప్పుడే ఈ చిట్కా ట్రై చేయండి


Also Read: Wipro Firing: ఉద్యోగులకు మళ్లీ షాకిచ్చిన విప్రో.. మరో లేఆఫ్ ప్రకటన.. ఈసారి ఎంతమంది అంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook