Wipro Firing: ఉద్యోగులకు మళ్లీ షాకిచ్చిన విప్రో.. మరో లేఆఫ్ ప్రకటన.. ఈసారి ఎంతమంది అంటే..?

Wipro Layoffs 2023: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. కొద్ది రోజుల క్రితమే 3900 మంది ఫ్రెషర్స్‌కు ఝలక్ ఇవ్వగా.. ఈసారి మరో 120 మంది ఉద్యోగులను తొలగిస్తూ.. మెయిల్ పంపించింది. ప్రపంచస్థాయిలో ఐటీ ఉద్యోగుల తొలగింపు ఆందోళనకు గురిచేస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 12:43 PM IST
Wipro Firing: ఉద్యోగులకు మళ్లీ షాకిచ్చిన విప్రో.. మరో లేఆఫ్ ప్రకటన.. ఈసారి ఎంతమంది అంటే..?

Wipro Layoffs 2023: టెక్ రంగంలో వరుస లే ఆఫ్ ప్రకటనలను ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారత్‌తో సహా ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక సంస్థ లే ఆఫ్ ప్రకటిస్తూ.. ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాదే ఎక్కువ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు మళ్లీ ఈ జాబితాలోకి మరో ఐటీ దిగ్గజం విప్రో చేరబోతోంది. విప్రో దాదాపు 120 మంది ఉద్యోగులను తొలగించింది. 

ఈ లేఆఫ్‌ ప్రకటన భారత్‌లో కాదు. 120 మంది యూఎస్ ఉద్యోగులను ఇంటికి పంపించనుంది విప్రో. తమ వ్యాపారాన్ని పునర్నిర్మించే క్రమంలో వీరిని తొలగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 100 మందికిపైగా ప్రాసెసింగ్ ఏజెంట్లు ఉన్నారని తెలిపింది. ఈ రిట్రెంచ్‌మెంట్ ఒక ప్రాంతంలో మాత్రమే జరిగిందని.. ఇది మిగిలిన అమెరికన్ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. మిగిలిన ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ఉద్యోగుల తొలగింపు మే నెలలోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు వారు నోటీసు పీరియడ్‌లో ఉన్నారు. ఈ కాలంలో కంపెనీ జీతం, ఇతర అలవెన్సులను చెల్లిస్తుంది. 

విప్రో కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించడం ఈ ఏడాది ఇది మూడోసారి. జనవరి నెలలో ఇంటర్నల్ టెస్ట్ ఆధారంగా 400 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చినా.. వృత్తిపరంగా బెస్ట్ పర్ఫామెన్స్ చేయలేకపోవడంతో సంబంధిత ఉద్యోగులకు టెర్మినేషన్ లెటర్లను మెయిల్ పంపించింది. శిక్షణ కోసం రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఈ ఉద్యోగులతో కంపెనీ ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నా.. ఉద్యోగాలను తొలగించే సమయంలో ఆ డబ్బు చెల్లించాల్సిన పనిలేదని చెప్పింది.  

కొద్ది రోజుల క్రితమే 3900 మంది ఫ్రెషర్స్‌ను కూడా విప్రో ఇంటికి సాగనంపిన విషయం తెలిసిందే. ఆఫర్లు లెటర్లు రిలీజ్ చేసిన తరువాత.. కొద్ది రోజులకు సగం జీతానికే చేరాలంటూ మెయిల్ పంపించింది. మొదట రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీ ఆఫర్ చేసిన విప్రో.. దానిని రూ.3.5 లక్షలకు తగ్గించుకుని ఉద్యోగాల్లో చేరాలని సూచించింది. విప్రో నిర్ణయంపై దుమారం చెలరేగగా.. కంపెనీపై ఫ్రెషర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Ravindra Jadeja: ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టిన రవీంద్ర జడేజా.. నిజమేనా..!

Also Read: AP Weather Report: నేడు ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News