Skin Care Tips: ప్రస్తుతం చాలా మంది చర్మ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మారుతున్న పరిస్థితుల కారణంగా చర్మ సౌదర్యాన్ని రక్షించుకోవడం చాలా ఇబ్బంది కరంగా మారింది. అయితే చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి చాలా మంది టోనింగ్, మాయిశ్చరైజర్, క్లెన్సింగ్ మొదలైనవి చేస్తూ ఉన్నారు. అయితే వీటి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని కోసం తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే  పానీయాలపై కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా చర్మ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి వాటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


చర్మ సమస్యలు ఉంటే ఈ ఆహారాలు తీసుకోవద్దు:


>>ఇప్పటికే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే నూనెలు అతిగా ఉండే  సమోసాలు, బజ్జీలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల చర్మం జిడ్డుగా మారడమేకాకుండా మొటిమలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది.


>>ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్‌ కూడా విచ్చల విడిగా తీసుకుంటూ ఉంటున్నారు. వీటిని కూడా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలలో అధిక కేలరీలు, కొవ్వు, పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి  చర్మానికి హాని కలిగిస్తాయి.


>>చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు స్పైసీ ఫుడ్ కూడా తినకూడదు. వీటిని పరిమితంగా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అతిగా తింటే ప్రమాదమేనని నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శీతల పానీయాలు, ఆల్కహాల్ వంటి సోడా డ్రింక్స్ తీసుకోకూడదు.


>>చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి పలు రకాల కూరగాయలను కూడా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మిరపకాయలను తీసుకుంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని ఆహారంలో తక్కుగా వినియోగించాలి.


Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!


Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి