ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) లేకుండా జీవితం కొనసాగించడం కష్టంగా మారింది. అయితే మీకు తెలుసా మీ స్మార్ట్ ఫోన్ మీకు తెలియకుండానే ఎంతో నష్టాన్ని కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్  నుంచి వచ్చే వెలుగు నుంచి కంటి చూపును,  ఆరోగ్యాన్ని( Health ) ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం...



1) మీరు ఎక్కువ సమయం ఫోన్ తో గడిపేలా యాప్స్ ను ( Apps ) సిద్ధం చేస్తారు. వీలైతే యాప్స్ కు బదులుగా వెబ్ సైట్స్ విజిట్ చేయడం ప్రారంభించండి.


2) GO Gray అనే యాప్ యాప్ స్టోర్ లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్ వల్ల మీ ఫోన్ తెర ( Screen ) మీకు గ్రే రంగులో కనిపిస్తుంది. దాని కోసం ఒక ప్రత్యేక టైమ్ షెడ్యూల్ చేస్తే సరిపోతుంది. దీని వల్ల మీ కంటిపై ప్రెషర్ తొలగిపోతుంది.
3) ఈ యాప్ ద్వారా మీరు మీ ఫోన్ లో ఇంటర్నెట్ వినియోగాన్ని తక్కువ సమాయానికి కుదించే అవకాశం ఉంది.



4) మీ ఫోన్ లో ఉన్న "Do Not Disturb" అనే అప్షన్ ను తరచూ వినియోగించండి.
5) బ్లూ టూత్ హెడ్ సెట్ వాడటం వల్ల మీ కళ్ల నుంచి ఫోన్ ను కాస్త దూరంగా ఉంచవచ్చు.
6) టైమ్ చూసుకోవడానికి కూడా చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దానికి బదులు మీ రెగ్యులర్ వాచును చూడటం ప్రారంభించండి. ఈ విధంగా మీ లైఫ్ స్టైల్లో ( Lifestyle ) ఈ చిట్కాలు పాటించి మీ కంటిచూపును కాపాడుకోవచ్చు.