కోవిడ్-19 ( Covid 19 ) మహమ్మారి ప్రపంచాన్ని పీడకలల పట్టుకుంది. ఈ సంవత్సరం లాక్ డౌన్ ( Lockdown ) లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. అన్ లాక్ ప్రక్రియను మొదలు పెట్టిన తరువాత అప్పటి దాక ఇంట్లో బంధీలుగా ఉన్న వాళ్లు మళ్లీ మాల్స్ ( Malls ) వెళ్తున్నారు. షాపింగ్ (Shopping ) చేస్తున్నారు. మరి కరోనావైరస్ ( Coronavirus ) సమయంలో మీరు కూడా షాపింగ్ కి వెళ్తున్నారా.. లేదా ప్లాన్ చేస్తున్నారా.. అయితే  ఈ చిట్కాలు పాటించండి.



- ప్రతీ మాల్ లో యూవీ స్కాన్ (Uv Scan ) పెడుతున్నారు. దాన్ని వినియోగించుకోవాలి. బ్యాగులు, చెప్పులు, షూస్ శానిటైజ్ చేసుకోండి.
- ఆరోగ్య సేతు (Arogya Setu App) యాప్ ను ముందుగా డౌన్ లోడ్ చేసుకోండి. దీని వల్ల కరోనావైరస్ పాజిటీవ్ (Coronavirus Positive ) గా తేలిన వ్యక్తుల గురించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. 




- అన్నింటికన్నా ముందు విండో షాపింగ్ ( No Window Shopping In Corona Times ) కోసమో.. సరదా కోసమో షాపింగ్ మాల్ కు వెల్లాలి అనుకుంటే మాత్రం ఇది అంత సేఫ్ నిర్ణయం కాదు అని గుర్తుంచుకోండి.
- మాల్ లో భౌతిక దూరం (Social Distancing ) తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా నలుగురు గుమిగూడే ఎస్కలేటర్, బిల్ కౌంటర్ వద్ద కనీసం ఆరు అడుగులు దూరం పాటించాలి.
- సమయాన్ని బట్టి మాల్ సిబ్బంది చెప్పే నియమాల్ని పాటించాలి (Shopping mall Rules ).
- శానిటైజ్ చేసిన డ్రెస్సులు మాత్రమే మీరు ట్రయల్ చేయడానికి తీసుకెళ్లండి. వాళ్లు ట్రయల్ తరువాత శానిటైజ్ చేస్తున్న విషయం తెలుసుకోండి.


Viral Video: ఈదురుగాలికి విమానం ల్యాండ్ అవలేకపోయింది



- క్యాష్ రూపంలో కాకుండా డిజిటల్ క్యాష్ చెల్లించండి (Pay Digital In Corona Times ).
- షాపింగ్ మాల్ లో ఉద్యోగులు మాస్క్ , గ్లవ్స్ వాడుతున్నారో లేదో అబ్జర్వ్ చేయండి. మీరు కూడా తప్పకుండా వాడండి.
- హైజీన్ గా ఉన్న ఫుట్ కోర్టుకు మాత్రమే వెళ్లండి. 
- చిన్న స్ప్రే, శానిటైజర్ మీతో ఎప్పుడూ ఉండేలా చూసుకోండి
- మాల్ నుంచి వచ్చే సమయంలో కూడా బ్యాగులను కూడా మీరు శానిటైజ్ చేయమని అడగండి.


Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే!