AP Fights Covid19: కోవిడ్-19 సమాచారం కోసం ప్రత్యేక నెంబర్

ఆంధ్రప్రదేశ్  ( Andhra Pradesh )  లో కరోనావైరస్ ( Coronavirus ) గురించి సమాచారం తెలుసుకోవాలి అనుకునే వారికి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ ను కేటాయించింది.

Last Updated : Aug 13, 2020, 04:11 PM IST
AP Fights Covid19: కోవిడ్-19 సమాచారం కోసం ప్రత్యేక నెంబర్

ఆంధ్రప్రదేశ్  ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) గురించి సమాచారం తెలుసుకోవాలి అనుకునే వారికి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ ను కేటాయించింది. కోవిడ్ -19 గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఏపి ప్రజలు ఇకపై 8297 104 104కి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ నెంబర్ కు కాల్ చేస్తే మీకు ఒక ఐవీఆర్ ( IVR ) ద్వారా తాజా సమాచారం తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయంపై ఒక ప్రకటన చేసింది. ఈ నెంబర్ కు కాల్ చేసి కోవిడ్-19 ( Covid 19 ) సమాచారమే కాదు.. సహాయం కూడా పొందవచ్చని తెలిపింది. 

మరోవైపు ఏపిలో ( Covid 19 Cases in AP ) రోజుకు వేల సంఖ్యలో కరోనావైరస్ కేసులు మోదు అవుతున్నాయి. 12వ తేదీన విడుదలైన మీడియా బులెటిన్ ప్రకారం 24 గంటల్లోనే 9,597 మందికి కరోనా సోకింది. 6,676 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 26 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. 

Andhra

Trending News