Weight Loss: ఈ టైమ్‌లో తింటేనే బరువు తగ్గుతారు, లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు!
Weight Loss Diet Plan: బరువు తగ్గడం చాలా కష్టం.. ప్రస్తుతం ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల తీవ్ర బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయాల్లో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Weight Loss Diet Plan: లాక్డౌన్ తర్వాత అంత మరిపోయింది. చాలా మంది జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. దీని కారణంగా బరువు పెరగడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. శరీర బరువు పెరగడం కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరుగుతుంది. దీంతో ప్రాణాంతక సమస్యల బారిన పడుతున్నారు. అధిక శరీర బరువు ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలు రకాల ఆహార నియమాలతో పాటు డైట్ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. సరైన సమయంలో అల్పాహారం, భోజనం చేయడం వల్ల శరీర బరువును సులభంగా నియంత్రణలో ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలతో శరీర బరువును తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాలతో సులభంగా శరీర బరువుకు చెక్:
మూడు సార్లు పద్ధతి ప్రకారం ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర, భోజనం రెండు బరువు తగ్గడానికి అవసరమే:
భోజనం చేసిన తర్వాత శరీరం ఎంత సేపు యాక్టివ్‌గా ఉంటుందో..కేలరీలు ఎక్కువ కాలం బర్న్ అవుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా ఉండడానికి తప్పకుండా తిన్న వెంటనే నిద్రపోవడం మానుకోవాల్సి ఉంటుంది. రాత్రి లేదా పగలు నిద్రకు 3 గంటల ముందు ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
నిద్రపోయే ముందు రాత్రి భోజనం చేయండి:
శరీరం విశ్రాంతి తికుసుకునేదానికి ముందు బాడీ మెలటోనిన్‌ను విడుదల చేయడం ప్రారంభమవుతుంది. కాబట్టి నిద్రపోయే దానికి ముందు ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ సమయాల్లో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
సర్వేలు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 7:00 గంటలకు మాత్రమే అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం, రాత్రి 7:00 గంటలకు రాత్రి భోజనం చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇతర సమయాల్లో ఆహారాలు తినడం వల్ల చాలా దుష్ర్పభాలు కలుగుతాయి. కాబట్టి అతిగా తినడం మానుకుని, సరైన సమయాల్లో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook