Weight Loss Tips: అది తాగడం మొదలెడితే...21 రోజుల్లో కొవ్వంతా వెన్న కరిగినట్టు కరగడం ఖాయం
Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా యువత ఈ సమస్యతో ఇబ్బంది పడుతోంది. పొట్ట చుట్టూ అనవసరంగా కొవ్వు పేరుకుపోతోంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన జీవనశైలి కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇందులో ముఖ్యమైంది అధిక బరువు. అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు అద్భుతమైన ఔషధం కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
చాలామందికి గ్రీన్ టీ గురించి తెలుసు. గ్రీన్ కాఫీ గురించి తెలియదు. గ్రీన్ కాఫీ అనేది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరపు మెటబోలిజం మెరుగుపడుతుంది. గ్రీన్ టీ అయితే చాలామంది తీసుకుంటుంటారు. ఉదయం లేచినవెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీతో బరువు కూడా తగ్గుతారు. అయితే కొంతమందికి గ్రీన్ టీ అంటే ఇష్టముండదు. ఈ క్రమంలో గ్రీన్ కాఫీ మంచి ప్రత్యామ్నాయం కాగలదు. గ్రీన్ కాఫీ కూడా శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.
గ్రీన్ కాఫీ ప్రయోజనాలు
చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా బరువు వేగంగా పెరుగుతోంది. ఫలితంగా పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. గ్రీన్ కాఫీ తాగడం వల్ల పొట్టు చుట్టూ ఉండే కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది.
2. గ్రీన్ కాఫీని బ్రోకలీ కాఫీగా కూడా పిలుస్తారు. ఎందుకంటే గ్రీన్ కాఫీ తయారీలో బ్రోకలీ ఉపయోగిస్తారు. బ్రోకలీ పౌడర్ సహాయంతోనే గ్రీన్ కాఫీ తయారవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా శరీరం మెటబోలిజం మెరుగుపడుతుంది.
3. బ్రోకలీ కాఫీలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇంట్లో కూడా గ్రీన్ కాఫీ తయారు చేసుకోవచ్చు. దీనికోసం బ్రోకలీని చిన్న చిన్న ముక్కలుగా కోసి...ఎండలో ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తరువాత పౌడర్ గా చేసుకుని స్టోర్ చేసుకోవాలి. వేడి వేడి పాలలో ఈ పౌడర్ వేసి కాఫీ చేసుకోవాలి.
ఇందులో రుచి కోసం కొద్దిగా ఫ్లేవర్ కలుపుకోవచ్చు. గ్రీన్ కాఫీ లేదా గ్రీన్ టీ రెండింటితోనూ ప్రయోజనాలు ఒకటే. గ్రీన్ కాఫీ రుచి నచ్చకపోతే..బరువు తగ్గేందుకు గ్రీన్ టీ తాగవచ్చు. మరోవైపు ఈ రెండింటివల్ల మధుమేహం, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటాయి. గ్రీన్ టీ లేదా గ్రీన్ కాఫీతో కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Blackheads Remover: నయా పైసా ఖర్చు లేకుండా బ్లాక్ హెడ్స్‌ను కేవలం 2 రోజుల్లో ఇలా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook