Blackheads Remover: నయా పైసా ఖర్చు లేకుండా బ్లాక్ హెడ్స్‌ను కేవలం 2 రోజుల్లో ఇలా చెక్‌ పెట్టొచ్చు..

Blackheads Remover In 2 Days: చాలా మందిలో వివిధ కారణాల వల్ల బ్లాక్ హెడ్స్‌ ఏర్పడుతున్నాయి. అయితే వీటి కోసం రసాయనాలు కలిగిన ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. ఈ ప్రోడక్ట్‌ను వినియోగించకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 06:12 PM IST
Blackheads Remover: నయా పైసా ఖర్చు లేకుండా బ్లాక్ హెడ్స్‌ను కేవలం 2 రోజుల్లో ఇలా చెక్‌ పెట్టొచ్చు..

How To Remove Blackheads From Nose At Home: ముఖంపై మృతకణాల కింద నూనె పేరుకుపోవడం వల్ల చర్మం చిన్న చిన్న రేణువులు బయటి వస్తాయి. దీని వల్ల అలా బయటి వచ్చిన రేణువులకు గాలి తాకి ఆక్సీకరణం చెంది నల్లగా మారుతుంది. ఇలా నల్లగా తయారైన రేణువుల పరిమాణాలను బ్లాక్‌హెడ్స్‌ అని అంటారు. అయితే వీటిని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్ల తీవ్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని చర్మ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉపశమనం పొందడాని పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్లాక్ హెడ్స్‌ను తొలగించే ఇంటి చిట్కాలు:

గుడ్డు:
ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేయాలి. దీనిని 15 నుంచి 25 నిమిషాల దాకా అలానే ఉంచి ఆరిన తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్‌ సులభంగా దూరమవుతాయి.

వంట సోడా:
ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో.. రెండు టీస్పూన్ల నీటిని కలిపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం నుంచి నూనెను తొలగిపోయి చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఇది శరీరానికే కాకుండా చర్మానికి కూడా ప్రభావవంగా సహాయపడుతుంది.  అయితే దీని కోసం ఒక చెంచా గ్రీన్ టీ ఆకులను తీసుకుని అందులో నీళ్లతో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు:
పసుపులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. బ్లాక్ హెడ్స్‌పై ప్రభావవంతంగా తొలగిస్తుంది.  పసుపులో కొబ్బరినూనెను కలుపుకుని మిశ్రమంలా తయారు చేసి.. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 10 నుంచి 25 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి.

Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్

Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News