Weight Loss With Kale: బరువు తగ్గడానికి సులవైన మార్గం ఇదే.. ఈ చిట్కా మీకు తెలుసా..?
Weight Loss With Kale: ఆకు కూరలు శరీరాని చాలా అవసరం. శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా.. వివిధ రకాల వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అందేకు పెద్దలు ఆకు కూరలను తినాలని సూచిస్తారు. ఈ కూరల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి.
Weight Loss With Kale: ఆకు కూరలు శరీరాని చాలా అవసరం. శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా.. వివిధ రకాల వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అందేకు పెద్దలు ఆకు కూరలను తినాలని సూచిస్తారు. ఈ కూరల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ముఖ్యంగా కాలే లాంటి ఆకు కూరలను తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటిని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని కూడా అంటారు. ఈ ఆకు కూరలో ఫైబర్ కంటెంట్ అధిక పరిమాణంలో ఉంటుంది. కావున శరీరాన్ని దృఢంగా చేసి.. చాలా రకాలుగా శరీరానికి మేలు చేస్తుంది. కావున ఈ ఆకు కూరలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కాలే ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు:
1. కాలే కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులను నియంత్రిస్తుంది. కాలేలో ఉండే బైల్ యాసిడ్ సీక్వెస్ట్రెంట్స్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గింస్తుంది. శరీరంలో పెరిగిన ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. కావున క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.
3. బీటా కెరోటిన్ అధిక పరిమాణంలో కాలేలో ఉంటుంది. ఇది కళ్ళకు అద్భుత ఔషధంగా పని చేస్తుంది.
4. కాలేలో యాంటీఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంపై ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి నియంత్రిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
5. ఈ ఆకులో కేలరీలు తక్కువగా పరిమాణంలో ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook