Quarentine Tips: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో అని కోట్లాది మంది భయపడుతున్నారు. కోవిడ్-19 ( Covid-19) వైరస్ సోకిన వారిని ప్రభుత్వం క్వారంటైన్ చేస్తుంది. లక్షణాలు లేనివారిని హోమ్ క్వారంటైన్‌కు వెళ్లమని వైద్యులు సలహాయిస్తున్నారు. అయితే హోమ్ క్వారంటైన్‌ ( Home Quaratine ) లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే సెల్ఫ్ క్వారైంటైన్‌లో ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.  ( Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


క్వారంటైన్‌లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: Tips For Self Quaratine


వెంటిలేషన్ ఉండాలి... ( Good Ventilation )
హోమ్ క్వారంటైన్‌లో ఉండే వ్యక్తి మంచి వెంటిలేషన్ ఉన్న గదిలో ఉండాలి. దాంతో పాటు రూమ్‌లో సెపరేట్ బాత్రూమ్ ఉండాలి.


భౌతిక దూరం.. ( Physical Distance )
బంధు మిత్రులతో కనీసం ఒక మీటర్ దూరం పాటించాలి. వీలైనంత దూరం పాటించడం మరీ మంచిది. అలాగే ఆహారం పంచుకోవడం చేయకూడదు.


వీళ్లకు దూరంగా ఉండండి..
హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న వారు వృద్ధులు, గర్భవతి మహిళ నుంచి దూరంగా ఉండాలి. పిల్లలతో దూరం పాటించాలి. ( 



Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ? ) 


ఇంటి నుంచి..
హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ఇంట నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన గడువు వరకు, లేదా నెగెటీవ్ వచ్చేంత వరకు బయటికి వెళ్లకూడదు. 


పరిశుభ్రత.. ( Hygienic )
ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న వారు పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. తరచూ చేతులు కడుగుతూ ఉండాలి. నిత్యం మాస్క్ ధరించాలి. ఇంట్లో వస్తువులను, సామగ్రీని షేర్ చేసుకోడం మానేయాలి. ఇంటిని, గదిని తరచూ శుభ్రం చేయాలి.


శానిటైజేషన్...( Sanitisation )
హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెలిసో తెలియకో కొన్ని వస్తువులను టచ్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆ వస్తువులను వెంటనే శానిటైజ్ చేయాలి. 
Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే



 



Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery


Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్


అందాల తార Eesha Gupta Hot Photos


 


Follow us on twitter