సీతాకోక చిలుకలు ఏమి తింటాయి.. అంటే పూవుల్లోని మకరందాన్ని తింటాయి అని ఠక్కున చెప్పేస్తాం.. కానీ అమెజాన్ అడవుల్లో ఉన్న సీతాకోక చిలుకలు మకరందాన్ని తినవట. అవి కన్నీళ్లను ఆహారంగా తాగుతాయట. నమ్మశక్యంగా లేదుకదూ ..! అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవలసిందే ..! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* ఓసారి అమెజాన్ అడవుల్లో ఒక శాస్త్రవేత్త పర్యటిస్తుండగా.. అతను కొన్ని సీతాకోక చిలుకలు మొసలి, తాబేలు కళ్ల నుండి కన్నీళ్లను పీల్చడం గమనించాడట. ఇలా ఎందుకు పీలుస్తున్నాయని సందేహం వచ్చి రోజుల తరబడి పరిశోధన చేశాడట.


* ఎప్పుడూ మకరందాన్ని తాగే వీటికి లవణాలు అవసరం. ఉప్పులో ఉండే పోషక పదార్థాలతో ఇవి గుడ్లు పెట్టి, జీవిత చక్రాన్ని సాఫీగా ఉంచుకోగలవు.


*ఈ లవణాలు పూల మకరందంలో దొరకవు. కనుక తాబేళ్లు, మొసలి లాంటి జీవుల్లో కన్నీళ్లను తాగేస్తాయి సీతాకోకచిలుకలు. ఒకరంకంగా చెప్పాలంటే రెండింటికీ ఉపయోగమే. ఎలాగంటారా.. ! సముద్రంలో ఉండి.. ఉండి మొసలి, తాబేలు  కళ్ల వద్ద సోడియం అధికంగా పేరుకుపోతుంది. సీతాకోకచిలుకలు పీల్చు కోవడంతో అది కాస్త తగ్గిపోతుంది. సీతాకోక చిలుకకూ లవణాలు దొరుకుతాయి.. ఆ జీవులకూ సోడియం తగ్గుతుంది.


* ఒక్క సీతాకోక చిలుకే కాదు, మకరందాన్ని పీల్చే తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట. మొసలి, తాబేలే కాదు పశువుల కన్నీళ్లను కూడా తాగుతాయి. మూత్రం, చెమట ఎక్కడ లవణాలుంటే అక్కడ వాలిపోతాయట ఈ మకరందం జీవులు.


*  మనకు కనిపించే సీతాకోక చిలుకల్లో ఈ ప్రవర్తనను ఎప్పుడూ గమనించలేదు కదూ. ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అవి కూడా ఇలానే ప్రవర్తిస్తున్నాయేమో ?!