Yellow Moong Dal Heart Diseases: మనమందరం ఖచ్చితంగా పెసర పప్పును ఆహారంలో క్రమం తప్పకుండా  తీసుకుంటాము. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం మొదలైనవి లభిస్తాయి. కాబట్టి ఈ పప్పును క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే మూలకాలు మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అయితే ఈ పప్పులను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెసర పప్పు ప్రయోజనాలు:


జీర్ణక్రియ సమస్యలు:
పెసర పప్పు తినడం వల్ల జీర్ణక్రయ శక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల వచ్చే పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పప్పులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. పొట్టలో గ్యాస్‌ తగ్గించేందు సహాయపడతాయి.


చర్మ సమస్యలకు చెక్‌:
పెసర పప్పు చర్మానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలోని చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి సహాయపడే మినరల్స్ ఇందులో అధిక పరిమణంలో లభిస్తాయి. దీనితో పాటు ఇందులో ఐరన్‌ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఈ పప్పును క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.


గుండె సమస్యలు:
పొటాషియం, ఐరన్ పెసర పప్పులో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పప్పును క్రమం తప్పకుండా తింటే రక్తపోటు సమస్యలు సులభంగా తగ్గుతాయి. క్రమరహిత, హృదయ స్పందనలో లోపం వంటి సమస్యలను దూరం చేసేందుకు సహాయపడతాయి. ఈ పప్పులో ఉండే ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read : Komati Reddy Venkat Reddy: కోమటి రెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం


Also Read : Dasoju Sravan: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి దాసోజు శ్రవణ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook