Yoga For Constipation: యోగా బాడీని ఫిట్‌గా ఉంచడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుని పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా మలబద్ధకం, అసిడిటీ, వికారం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా చిట్కాలున్నాయి. ఈ చిట్కాల కంటే ముందు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియమాలతో పాటు యోగాసనాలు వేయడం వల్ల పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయి. అయితే అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ యోగాసనాలు క్రమం తప్పకుండా వేయండి:


ఆంజనేయాసనం(Anjaneyasana):
ఈ ఆసనంలో శరీరం బాగా మెలితిరిగిపోతుంది. దీనిని కూర్చున్న ట్విస్టింగ్ పోజ్ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియపై చాలా ప్రభావం పడి మెరుగయ్యే అవకాశాలున్నాయి. ఈ యోగా చేయాలంటే ముందుగా నిటారుగా నిలబడాలి.. దీని తర్వాత రెండు పాదాలను వెడల్పుగా తెరిచి నిలబడి.. ఈ ఆసనాన్ని వేస్తారు. అయితే ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పొట్ట సమస్యలన్నీ దూరమవుతాయి. కావున పొట్ట సమస్యలతో బాధపడే వారు ఈ ఆసనాలను వేస్తే చాలా మేలు జరుగుంది.


హలాసనము(Halasana):
హలాసనము రోజూ చేయడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు జరుగుతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు సులభంగా ఉపశమనం పొందుతారు.


పవనముక్తాసనం(Pavanamuktasana):
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం నుంచి బయటపడటానికి ఇది చాలా సులభమైన మార్గమని నిపుణులు అంటున్నారు. కావున మలబద్ధకం ఇతర సమస్యలతో భాదపడుతున్న వారు కచ్చితంగా ఇలాంటి ఆసనాలను వేయాలి.


ధనురాసనము(Dhanurasana):
ధనురాసనము భంగిమలో శరీరం యొక్క ఆకారం విల్లులా మారుతుంది. కావున ఇది శరీరానికి, పొట్టకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. కావున పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆసనాలను వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.


Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook