Cockroach: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘కాక్రోచ్’ మూవీ.. ఇదెక్కడి మాస్ రచ్చరా మావ..!
Cockroach First Look: నేమ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు. పేరులో ఏముంది అని అందరు అంటారు. కానీ పేరుతోనే ఓ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తుంటారు. తాజాగా ‘కాక్రోచ్’ అనే టైటిల్ తోనే సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసారు మేకర్. తాజాగా విజయ దశమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Cockroach First Look:‘కాక్రోచ్’ టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు మేకర్స్. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ సంయుక్తం గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విజయ దశమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. విశాఖపట్నం నేపథ్యం లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైయలెంట్ యాక్షన్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంి. పాత కొత్త నటీ నటుల మేళవింపుతో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
త్వరలో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం మీడియాకు తెలియజేసింది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
త్వరలో మరిన్ని వివరాలతో ఆడియన్స్ ను కలుస్తామని చెప్పారు. అంతేకాదు డిఫరెంట్ కాన్సెస్ట్ చిత్రాలని ఆదరించే ప్రేక్షకుల కోసమే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ మరియు ఆదిత్య సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సంతోష్ శక్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తోన్న ఈ సినిమాకు రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రేమ్ సన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని ముతుకి నాగ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్వకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter