Joruga Husharuga Movie: వీరాజ్ అశ్విన్ మళ్లీ హిట్ కొట్టాడా..పూజిత, సిరి హనుమంతు సక్సెస్ అయ్యారా?
Joruga Husharuga Review: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ సినిమా ఫేమ్ వీరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించిన జోరుగా హుషారుగా సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో? పూజిత, సిరి హనుమంతు ఈ సినిమాలో ఎలా నటించారో అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Joruga Husharuga Review: ఓ ఆఫీసులో ఆనంద్(మధు నందన్) బస్ గా వ్యవహరిస్తాడు.. ఇదే ఆఫీసులో సంతోష్ (వీరాజ్ అశ్విన్) ఎంప్లాయ్ గా పని చేస్తూ.. నిత్య (పూజిత పొన్నాడ)తో అఫైర్‌లో ఉంటాడు. ఇదే క్రమంలో ఆనంద్ ఆ ఆఫీసులో టీం లీడ్ గా చేరుతాడు. వీరిద్దరి మధ్య ఉన్న అఫైర్ బయటికి రాకూడదని సంతోష్ తో పాటు నిత్య ఎన్నో జాగ్రత్తలు పడుతుంది. అయితే ఆనంద్ ఇంతకుముందే సుచిత్ర (సిరి హనుమంతు) తో ప్రేమలో ఉంటాడు. సుచిత్ర ప్రేమ కాదని ఆఫీసులో చేరిన నిత్యపై మోజులో పడతాడు ఆనంద్. సంతోష్ ప్రేమను శిల్ప ఎందుకు రిజెక్ట్ చేసింది? అసలు సంతోష్ నిత్యాల అఫైర్ ఎలా ఎక్కడ మొదలైంది? సంతోషంగా ఆఫీసులోనే నిత్య ఎందుకు చేరాల్సి వచ్చింది? వీరిద్దరూ ఆఫీసులో రొమాన్స్ లైఫ్ని ఎలా కొనసాగించారు? ఇంతకీ సంతోష్ ఎలా డీల్ చేశాడు? ఇదంతా ఇలా ఉండగా సంతోష్ తనకోసం 20 లక్షల పాటు పర్సనల్ లోన్ ఎందుకు తీయాలనుకున్నాడు? ఆనంద్ సుచిత్రను ఒక్కటి చేయాలని ప్రయత్నం ఏమైంది? ఇంతకుముందు ఫ్యామిలీలో వచ్చిన సమస్యలను సంతోష్ ఎలా గట్టెక్కించాడు? అనే క్యొచన్స్ కి ఆన్సరే జోరుగా హుషారుగా సినిమా కథ.
ప్రేమ ప్రేమ ఆఫీసులో రొమాన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి రాసుకున్న కథ.. డైరెక్టర్ అను ప్రసాద్ సినిమాలో డీల్ చేసిన విధానం ఎంతో బాగుంది. ఇప్పుడున్న యూత్ ను దృష్టిలో పెట్టుకొని రొమాన్స్ తో పాటు లవ్ కథను నడుపుతూ.. ఈ క్రమంలో సాయికుమార్, రోహిణి తో ఎమోషనల్ ట్రాక్ తీసుకురావడం చాలా బాగుంది. ఇక కామెడీ, ఫన్ విషయానికొస్తే..యూత్ ను దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాజీ, జెమినీ కిరణ్, రాజేష్ ఖన్నా వారి స్టైల్ లో కామెడీని పండించడం ఎంతో బాగుంది. సినిమా చివరి క్షణాల్లో పెళ్లి డ్రామా తో సినిమా ఎండ్ అవ్వడం ఫీల్ గుడ్ గా అనిపించింది. డైరెక్టర్ అను ప్రసాద్ ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టుకోవడం అందర్నీ మెప్పించేలా ఉంది.
బేబీ సినిమా తర్వాత వీరాజ్ అశ్విన్ ఈ సినిమాలో మంచి నటనతో రాణించడంతో ఆడియన్స్ దృష్టి ఈ మూవీ పై మరింత పడింది. కుటుంబ బాధ్యతలను ఎత్తుకొని ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతే.. తన ప్రేమను ఓ మంచి యువకుడిగా.. తనదైన శైలిలో నటించాడని చెప్పొచ్చు. డైలాగుల డెలివరీ, యాక్టింగ్, డాన్సుల పరంగా ఏమాత్రం వెనకకు తగ్గలేడు. ఈ పూజిత పొన్నాడతో మంచి కెమిస్ట్రీని నడిపించి రొమాంటిక్ సీన్స్ ను పండించాడు. ఇక సిరి హనుమంతు విషయానికొస్తే ఓ మంచి పాత్రలో ఒదిగిపోయింది. కంపెనీ బాసుగా మధు నందన్ కూడా తనదైన శైలిలో నటనను పండించాడు. కథకు హీరోలు పోషించిన సాయికుమార్, రోహిణి సెంటిమెంటుతో పడగొట్టారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ఈ జోరుగా హుషారుగా అనే మూవీకి సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమాలో ఉండే ప్రతి సీన్ ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు నాణ్యమైన వీడియో క్వాలిటీని అందించేందుకు మంచి లొకేషన్స్ లో షూట్ చేశారు. మంచు కొండల్లో వీరాజ్ పూజ పై చేసిన షూటింగ్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు ప్రణీత్ నంబూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా చేసింది. ఇందులో కొన్ని సీన్లు ఆహా అనిపించాయి. మార్తాడు వెంకటేష్ తన ఎక్స్పీరియన్స్ తో సినిమాను పరుగులు పెట్టించారు. సినిమా క్వాలిటీ కోసం ఏమాత్రం రాజీ పడకుండా నిరుష్ తిరువీడుల నిర్మాణం అందరినీ ఆకట్టుకునేలా చేసింది.
రేటింగ్: 3.0
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి