Prabhutvaa Junior Kalashala Punganuru 500143: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జోడిగా నటించిన చిత్రం  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ సినిమాను యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాను సెన్సార్ పూర్తి చేసుకుంది.  సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ అందుకుంది.  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.  ట్రైలర్ ఓ రేంజ్ లో ఉందంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్రైలర్ విషయానికొస్తే.. వాసు  టీనేజీ అబ్బాయి(ప్రణవ్ ప్రీతం) స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతుంటాడు. కాలేజ్ లో అడుగుపెట్టగానే అక్కడ గ్లామర్  అమ్మాయి కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్)ని చూసి ప్రేమలో పడతాడు. అన్ని టీనేజీ లవ్ స్టోరీల మాదిరే ీ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మధ్యలో ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు.. చివరకు వాళ్లు ఎలా కలుసుకొని ఒకటయ్యారనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని అర్ధమవుతోంది. ఒక బలమైన కారణంగా దూరమైన  ఈ జంట తిరిగి ప్రేమలో ఒక్కటయ్యారా ? లేదా ? అనే అంశాలతో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ట్రైలర్ లో 'తనువు నాది కానీ, మనసు నీది కాదా..నిను చూడలేకుండా ఉండదే..నిదురనైన నిన్ను మరువదే.. ' పాట స్పెషల్ అట్రాక్షన్ గా  నిలిచింది. అందమైన పల్లెటూరి విజువల్స్, ‌ఫీల్ గుడ్ లవ్ ఎలిమెంట్స్, ఎమోషన్, మ్యూజిక్ వంటి అంశాలన్నీ ట్రైలర్ లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్   నెల 21న విడుదల కాబోతను్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమాకు కూడా దక్కుతుందని సినిమా యూనిట్ ఆశిస్తోంది.



నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల


సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter