US GUN Fire: అమెరికాలో నల్గొండ యువకుడు కాల్చివేత.. నల్ల జాతీయుల ఘాతుకం
US GUN Fire: అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణ ఘటన జరిగింది. మేరీలాండ్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. నల్లగొండ పట్టణానికి చెందిన నక్కా సాయి చరణ్ మేరీలాండ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు
US GUN Fire: అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణ ఘటన జరిగింది. మేరీలాండ్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. నల్లగొండ పట్టణానికి చెందిన నక్కా సాయి చరణ్ మేరీలాండ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం సాయి చరణ్ తన స్నేహితులను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసి కారులో తిరిగి వెళుతుండగా ఈ ఘాతుకం జరిగింది. కారును ఆపిన నల్ల జాతీయులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో సాయి చరణ్ స్పాట్ లోనే చనిపోయారు. సాయి కుమార్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అమెరికాలో ఎమ్మెస్ పూర్తిచేసిన సాయి చరణ్... ఆరు నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాకా ఇంటికి రాలేదు. సెప్టెంబర్ లోనే ఇండియాకు రావాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో నల్లజాతీయుల చేతిలో చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. అగ్రరాజ్యంలో నల్లజాతీయుల కాల్పులపై సాయి చరణ్ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరిగితే విద్య ఉద్యోగం కోసం అగ్రరాజ్యానికి పిల్లలని ఎలా పంపుతారని తండ్రి నరసింహ ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా నల్లజాతీయుల చేతిలో విద్యార్థులు ఉద్యోగులు చనిపోకుండా కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నల్లజాతీయుల కాల్పుల్లో చనిపోయిన సాయి చరణ్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సాయం చేయాలని సాయి చరణ్ తండ్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
Read also: BJP Target TDP: చంద్రబాబుపై మోడీ, అమిత్ షాకు కసి తీరలేదా!ఏపీ బీజేపీ చీఫ్ గా ఎన్టీఆర్ తనయ?
Also Read: Yogini Ekadashi 2022: యోగినీ ఏకాదశి రోజున ఈ సింపుల్ పరిహారాలు చేయండి.. అపారమైన సంపదను పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.