Agnipath Violence: సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.. సుబ్బారావు డైరెక్షన్ లోనే విధ్వంసం?

Agnipath Violence: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది.ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.విచారణలో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయని తెలుస్తోంది

Written by - Srisailam | Last Updated : Jun 22, 2022, 10:39 AM IST
  • సికింద్రాబాద్ అల్లర్లపై ముమ్మర విచారణ
  • ఆవుల సుబ్బారావు నుంచి కీలక సమాచారం
  • సుబ్బారావు రెచ్చగొట్టడం వల్లే విధ్వంసం
Agnipath Violence: సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.. సుబ్బారావు డైరెక్షన్ లోనే విధ్వంసం?

Agnipath Violence: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. సీసీ కెమెరాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 56 మందిని రిమాండ్ రు పంపించిగా... మరో 80 మంది అనుమానితులను పోలీసుుల అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న యువకులు భయంతో హడలిపోతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న అజయ్.. అక్కడే ఒక టీవీ ఛానల్ లో మాట్లాడారు. మీడియా ఫుటేజీ ఆధారంగా తన మీద పోలీసులు కేస్ నమోదు చేస్తారేమో అని భయంతో అజయ్ ఆత్మహత్యా యత్నం చేశాడు. బాధితుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

మరోవైపు ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయని తెలుస్తోంది. పల్నాడు జిల్లా రావిపాడు బై పాస్ రోడ్ లో సాయి అకాడెమీ మెయిన్ బ్రాంచ్ ఉంది. ఐటీ అధికారులు 3 రోజుల పాటు సోదాలు చేశారు. సాయి అకాడెమీలో కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. సోదాల్లో హార్డ్ డిస్క్ లతో పాటు అనేక మంది అభ్యర్థుల 10 వ తరగతి మెమోలు లభించాయి. మూడు రోజుల గా సుబ్బారావును విచారించిన ఐటి అధికారులు.. కీలక వివరాలు రాబట్టారు. విచారణ ముగియడంతో సుబ్బారావు ను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు.. రిమాండ్ కు తరలించనున్నారు.

తమ విచారణలో పక్కా ప్లాన్ తో విద్యార్థులను సుబ్బారావు రెచ్చగొట్టారని పోలీసులు గుర్తించారని సమాచారం. ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సుబ్బారావు 9 బ్రాంచ్ లు నడిపిస్తున్నారు. ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో 2 లక్షలు ఫీజ్ తీసుకుంటున్నారు సుబ్బారావు. ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్ధులు తన అకాడెమీలో చేరేలా పేమెంట్స్ ను విడతల వారీగా చెల్లించేలా సుబ్బారావు డీల్ చేసుకున్నారని తెలుస్తోంది. తన అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారని సుబ్బారావు హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. ఆర్మీ కి సెలెక్ట్ అయ్యిన తర్వాత మిగతా మొత్తం చెల్లించేలా అభ్యర్ధులకు కొటేషన్ ఇచ్చారు. గ్యారెంటీ కింద అభ్యర్థులకు చెందిన 10వ తరగతి మెమోలు తన దగ్గరే పెట్టుకున్నారు సుబ్బరావు.

సాయి అకాడెమీలో చేరిన అభ్యర్థులు ఇప్పటికే ప్రాథమిక పరీక్ష పూర్తి చేసుకున్నారు. రాత పరీక్ష రాసి ఫలితాలు వస్తే అభ్యర్థుల నుంచి భారీగా సుబ్బారావు కు ఫీజులు వస్తాయి. అయితే కేంద్ర సర్కార్ రాతపరీక్షను రద్దు చేసి కొత్తగా అగ్నిపథ్ స్కీం తీసుకురావడంతో.. సుబ్బారావుకు వస్తాయనుకున్న డబ్బులు రాకుండా పోయాయి. అగ్నిపథ్ తో సుబ్బారావుకు కోట్లాది రూపాయల నష్టం జరిగిందని తెలుస్తోంది. దీంతో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా అభ్యర్థులను రెచ్చగొట్టి విధ్వంసానికి ప్లాన్ చేశారని పోలీలుసు తేల్చారని తెలుస్తోంది.

Read also: AP Inter Results 2022: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Read also: Who is Draupadi Murmu : ద్రౌపది ముర్ము ఎవరు ? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపి ఆమెనే ఎందుకు ఎంచుకుంది ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News