Yogini Ekadashi 2022: జూన్ 24న యోగిని ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ రోజున శ్రీ హరిని పూజించి, ఉపవాసం ఉండడం ద్వారా మోక్షాన్ని పొందేటట్టు అనుగ్రహించమని కోరుకుంటారు. యోగినీ ఏకాదశి వ్రతం (Yogini Ekadashi 2022) చేయడం వల్ల పాపాలు, దుఃఖాలు తొలగిపోతాయి. మరణానంతరం స్వర్గంలో స్థానం లభిస్తుంది. యోగినీ ఏకాదశి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీ సంపద, ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. అంతేకాకుండా మీ కోరికలను నెరవేరుతాయి.
పరిహారాలు
1. ఏకాదశి వ్రత రోజున విష్ణువుకు ఖీర్ సమర్పించండి. ఖీర్‌లో తులసి ఆకులను వేయండి. దీంతో శ్రీ హరివిష్ణువు మీ పట్ల ప్రసన్నుడై మీ కోరికలు తీరుస్తాడు.
2. పంచామృతం విష్ణువుకు ప్రీతికరమైనది. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేయండి. పంచామృతాన్ని ప్రసాదం రూపంలో తీసుకోండి. దీనితో మీరు విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. ఐశ్వర్యం, కోరికలు కూడా నెరవేరుతాయి.
3. ఏకాదశి రోజున ఆరాధన సమయంలో శ్రీమహావిష్ణువుతో పాటు దక్షిణవర్తి శంఖాన్ని పూజించండి. పూజానంతరం పసుపు బియ్యం, శనగపప్పు, అరటిపండు, బెల్లం, పసుపు బట్టలు మొదలైన వాటిని దానం చేయండి. విష్ణువు అనుగ్రహం వల్ల మీకు సంతోషం, సంపద పెరుగుతాయి.
4. ఏకాదశి రోజున పీపుల్ చెట్టుకు నీరు సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి. శ్రీమహావిష్ణువు పీపుల్ చెట్టులో ఉంటాడు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది.
5. ఏకాదశి రోజు సాయంత్రం వేళలో తులసిని పూజించండి. తులసి పీఠంపై నెయ్యి దీపాన్ని వెలిగించి కనీసం 5 లేదా 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. మీ సంపద పెరుగుతుంది, జీవితం సంతోషంగా ఉంటుంది.
యోగిని ఏకాదశి 2022 ముహూర్తం
ఆషాఢ కృష్ణ ఏకాదశి తిథి ప్రారంభం: జూన్ 23, రాత్రి 09:41 గంటలకు
ఆషాఢ కృష్ణ ఏకాదశి తిథి ముగుస్తుంది: జూన్ 24, రాత్రి 11:12 గంటలకు
ఉపవాస సమయం: జూన్ 25, 05:41 AM నుండి 08:12 AM వరకు
Also Read: Shani Dev: జూలై 12న రాశిని మార్చబోతున్న శని... ఈ 3 రాశులవారికి ఇబ్బందులు తప్పవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.