7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం
7th Pay Commission Latest Updates: ఏడవ వేతన సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రస్తావించారు. జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ బెనిఫిట్స్ పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, పసిడి దారిలోనే వెండి రేట్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(DA), డీఆర్ మూడు వాయిదాలు బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వం వారికి గత ఏడాది నుంచి చెల్లించలేదు. జనవరి 1, 2020 నుంచి నేటి వరకు మూడు దఫాలు చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఆర్, డీఏలను జూలై 1, 2021 నుంచి చెల్లించనున్నారు.
Also Read: Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి
50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా డీఏ, డీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో జనవరి 1, 2020, జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 వాయిదాల నగదు ఉద్యోగులకు అందలేదు. దీంతో వారికి అరియర్స్ సహా ప్రస్తుతం పెరగనున్న జీతాలు మరికొన్ని నెలల్లో వారికి కేంద్రం ఇవ్వనుంది.
Also Read: Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ 17 శాతం అందుతుంది. జూలై 2019 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత DAను పొందుతున్నారు. కనుక అనంతరం పెరగాల్సిన మూడు డీఏలపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.
Also Read: Google Search: గూగుల్‌లో ఈ విషయాలు అసలు సెర్చ్ చేయవద్దు, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దాంతో వారికి కొత్త డీఏ ప్రకారం మొత్తం 21 శాతం రానుంది. బకాయిపడ్డ డీఏలను సైతం పెంచితే వారికి ఏకంగా 28 శాతం డీఏ ఇవ్వాల్సి వస్తుంది. కొంతకాలం డీఏ, డీఆర్‌లను నిలిపివేస్తూ ప్రభుత్వం గత ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook