Darjeeling Tiger Hill: ఇక్కడ్నించి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించవచ్చు
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ అత్యంత అందమైన ప్రాంతం. పశ్చిమ బెంగాల్ వెళితే డార్జిలింగ్ సందర్శన మర్చిపోవద్దు.
ఓ వైపు హిమాలయాలు చూస్తూ మరోవైపు సూర్యోదయం-సూర్యాస్తమయం రెండూ చూసే అద్భుతమైన ప్రాంతం ఇండియాలో ఉందంటే నమ్ముతారా. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ అందుకు తగ్గ ప్రదేశం.
డార్జిలింగ్ టైగర్ హిల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ్నించి అందమైన దృశ్యాలు చూడవచ్చు. హిమాలయ శ్రేణుల్ని ఎంజాయ్ చేయవచ్చు. హిమాలయాల చిటారున ఉంది ఈ హిల్ స్టేషన్
ఈ హిల్ స్టేషన్ నుంచి మంచుతో కప్పుకుపోయున్న పర్వతాలు చూడవచ్చు. టైగర్ హిల్ డార్జిలింగ్ నగరం నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రమట్టానికి 2567 మీటర్ల ఎత్తులో ఉంది.
టైగర్ హిల్ డార్జిలింగ్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశం. ఇక్కడ్నించి ప్రకృతి అందాల్ని అద్భుతంగా ఆస్వాదించవచ్చు.
టైగర్ హిల్ సందర్శించినప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం ఒకేసారి వీక్షించవచ్చు. మంచులో కప్పుకుపోయి మెరుస్తున్న పర్వతాల అందాలు ఆస్వాదించవచ్చు.