Heavy rains updates: ఈ జాబితాలోని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. IMD నివేదిక
సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాపాతంపై భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర (IMD Director General Mrutunjay Mohapatra) నివేదిక విడుదల చేస్తూ పలు వివరాలు వెల్లడించారు. ( Image credits: PTI )
ఆగస్టు నెలలో వర్షాపాతం (Rainfall) తక్కువగా నమోదైన చోట సెప్టెంబర్ నెలలో ఆ లోటును భర్తీ చేస్తూ అధిక వర్షాలు కురుసే వీలు ఉన్నట్టు మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. (File photo)
ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ (IMD). దక్షిణ ఒడిషా, కోస్తాంధ్ర, తెలంగాణ, విదర్భ. దక్షిణ చత్తీస్‌ఘడ్‌లో పలు ప్రాంతాల్లో 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు (very heavy rainfall) కురిసే వీలు ఉంది. (Image credits : PTI)
మహారాష్ట్రలోని ఉత్తర మరాట్వాడ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, ఉత్తర కొంకన, గుజరాత్‌లలో సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rain) కురిసే అవకాశం ఉంది. (Image credits : PTI)
Also read : Best Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు ఆహార పదార్ధాలివే
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో (Himachal Pradesh, Uttarakhand, Punjab) జల్లులు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో వీటి తీవ్రత అధికంగానే ఉండనుందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. (Image credits : PTI)
Also read : Coconut Benefits: కొబ్బరి బొండాలతో బరువు కూడా తగ్గించుకోవచ్చు..ఎలాగో తెలుసా
Also read : Best Food Habits: మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే ఈ ఐదు కూరగాయలు రోజూ తినండి చాలు