Best Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు ఆహార పదార్ధాలివే

కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న వ్యాధి. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినా కోవిడ్ సంక్రమణ ఆగడం లేదు. అటు ఇప్పటకీ కరోనా వైరస్ చికిత్సకు సరైన మందు లేని పరిస్థితి. ఈ నేపధ్యంలో నిత్యం తినే ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటే కరోనా వైరస్ మీ దరికి చేరకుండా జాగ్రత్త పడవచ్చు. కరోనాను నియంత్రించే ఆ ఆహారపు అలవాట్లేవో ఇప్పుడు చూద్దాం.

Best Immunity Food: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న వ్యాధి. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినా కోవిడ్ సంక్రమణ ఆగడం లేదు. అటు ఇప్పటకీ కరోనా వైరస్ చికిత్సకు సరైన మందు లేని పరిస్థితి. ఈ నేపధ్యంలో నిత్యం తినే ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటే కరోనా వైరస్ మీ దరికి చేరకుండా జాగ్రత్త పడవచ్చు. కరోనాను నియంత్రించే ఆ ఆహారపు అలవాట్లేవో ఇప్పుడు చూద్దాం.

1 /5

ఇక నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. హైడ్రేషన్ సమస్య తలెత్తదు. ముఖ్యంగా కొబ్బరి నీరు, నిమ్మరసం, హెర్బల్ టీ, ఓఆర్ఎస్ వంటివి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ప్యాకేజ్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. ఎప్పుడూ ఇంట్లో చేసిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.

2 /5

ఇక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పాలకూర, టమాట, బీట్ రూట్ వంటివి ఉండేట్టు చూసుకోవాలి. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్ వంటివి శరీరానికి బలాన్నిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి పాటిస్తూనే ప్రతి రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే ఏ మహమ్మారి కూడా మిమ్మల్ని తాకలేదు. 

3 /5

ఇక అన్నిరకాల పోషక పదార్ధాలు, బలమైన ఆహారంగా కిచిడీ చాలా మంచిది. ఇందులో ఉండే పప్పులు, అన్నం, కూరగాయలు, కాసింత గరం మసాలా రోగ నిరోధక శక్తిని అమాంతంగా పెంచుతుంది. బలమైన ఆహారంగానే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది కూడా.

4 /5

మరో బలవర్ధకమైన ఆహారం, రోగ నిరోధక శక్తిని పెంచేవి రాగులు , ఓట్స్. ఇందులో ఫైబర్, విటమిన్ బి, సంక్లిష్ట పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు రోజూ ఒక గుడ్డు తప్పకుండా తినాల్సిందే.

5 /5

నిత్యం మీరు తినే ఆహారంలో పోషక పదార్ధాలు మెండుగా ఉండేట్టు చూసుకోవాలి, ముఖ్యంగా విటమిన్ సి, జింక్ తప్పనిసరి. అందుకే నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటి ఆక్సిడెంట్లతో పాటు మంచి పోషకాలుంటాయి. కోవిడ్ వైరస్ నియంత్రణకు మంచి ఆహారం ఇది. ఎందుకంటే వీటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.