Best Food Habits: మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే ఈ ఐదు కూరగాయలు రోజూ తినండి చాలు

కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యేకించి ఆకు కూరగాయల్లో లేదా పచ్చని కూరగాయల్లో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. మీకు లాభాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతూ..బరువును తగ్గిస్తూ..రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చాలా సందర్భాల్లో ఆహారపు అలవాట్ల కారణంగానే అనారోగ్యం పాలవుతుంటాం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో గుండెకు ప్రమాదం ఏర్పడుతుంది.

Best Food Habits: కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యేకించి ఆకు కూరగాయల్లో లేదా పచ్చని కూరగాయల్లో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. మీకు లాభాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతూ..బరువును తగ్గిస్తూ..రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చాలా సందర్భాల్లో ఆహారపు అలవాట్ల కారణంగానే అనారోగ్యం పాలవుతుంటాం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో గుండెకు ప్రమాదం ఏర్పడుతుంది.
 

1 /5

బెండకాయలో పైబర్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, కార్బొహైడ్రేట్‌లు మెండుగా ఉంటాయి. బెండకాయ తినడం వల్ల గుండెకు సంబందించిన రోగాలు రాకుండా ఉంటాయి.

2 /5

ఇక వెల్లుల్లి చేసే మేలు మాటల్లో చెప్పలేం. వెల్లుల్లి తీసుకుంటే చాలా రకాల సంక్రమణల్నించి తప్పించుకోవచ్చు. ఇందులో ఉన్న ఎలిసిన్ కొలెస్ట్రార్ స్థాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. రక్తం క్లాట్ కాకుండా కాపాడుతుంది. 

3 /5

క్యారెట్ విటమిన్ సీ తో పాటు ఐరన్, సోడియం, పొటాషియం, కార్బొహైడ్రేట్, ప్రోటీన్, విటమిన్ ఎ , బీ 6  లకు మూలాధారం. క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో చేర్చితే..మీ గుండెను ముప్పు నుంచి తప్పించుతుంది. 

4 /5

పాలకూర అనేది పోషక పదార్ధాలతో నిండి ఉంటుంది. ఇందులో ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫోలెట్ వంటి పోషకాలుంటాయి. ఇది మీకు చాలా రోగాల్నించి కాపాడుతుంది. 

5 /5

కాలిఫ్లవర్‌లా కన్పించే బ్రోక్లీ..గుండెకు చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, కెరోటిన్, కార్బొహైడ్రేట్స్, ఐరన్, విటమిన్ ఎ వంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి తక్షణం మేలు చేకూరుస్తాయి. బ్రోక్లీని సూప్, కూర లేదా సలాడ్ కింద తినవచ్చు.