One year of Coronavirus: కరోనాకు ఏడాది పూర్తి.. కరోనా విధ్వంసంపై పలు గణాంకాలు

Tue, 17 Nov 2020-7:40 pm,

2019లో నవంబర్ 17 చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు హాంకాంగ్ పత్రిక ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. కరోనాను గుర్తించిన కొత్తలో రోజు వారీ కేసుల సంఖ్య అతి స్వల్పమే అయినప్పటికీ.. ఆ తర్వాత కొద్ది వారాల్లోనే అది విశ్వవ్యాప్తమై అనేక దేశాలకు వ్యాపించింది.

ఇదిలావుంటే, కరోనావైరస్ తొలి కేసు విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. కొవిడ్-19 తొలి కేసు డిసెంబర్ 8న గుర్తించినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు విషయానికొస్తే.. ఇదే ఏడాది జనవరి 30న కేరళలో తొలిసారిగా కరోనా కేసు నమోదైంది. వుహాన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వుహాన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ భారత్‌కి తిరిగి వచ్చిన విద్యార్థిలో తొలిసారిగా కరోనావైరస్‌ను గుర్తించారు. భారత్‌లో ఇదే తొలి కరోనా కేసుగా గణాంకాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు 5.50 కోట్ల మందికి కరోనావైరస్‌ సోకగా.. వారిలో 3.50 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 13.3 లక్షల మంది కరోనావైరస్ కారణంగా కన్నుమూశారు. 

భారత్‌లో కరోనా కేసుల విషయానికొస్తే.. ఇప్పటివరకు దేశంలో 88,74,291 కరోనా సోకగా వారిలో 82,90,371 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 4,53,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 13.3 లక్షల మంది చనిపోగా అందులో కేవలం భారత్‌లోనే మృతుల సంఖ్య  1,30,519 గా ఉంది.

ప్రస్తుతం 190 దేశాలు కరోనా బారినపడ్డాయి. భారత్‌లో కరోనాను గుర్తించిన మరుసటి రోజే బ్రిటన్‌లోనూ కరోనా బయటపడింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని గుర్తించినట్టు అక్కడి అధికారులు తెలిపారు.

కరోనావైరస్ వచ్చి ఏడాది పూర్తవుతున్నా.. ఇప్పటివరకు కరోనాకు వ్యాక్సిన్ మాత్రం రాలేదు. ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా వ్యాక్సిన్ కోసమే వేచిచూస్తోంది. అయితే, కేవలం కరోనా వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన్నే కరోనాపై పోరులో విజయం సాధించలేమని, జనం ఎవరికి వారు స్వీయ విచక్షణతో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివాతోనే కరోనాకు శాశ్వతంగా చెక్ పెట్టివచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. 

Also read : BCCI paid to UAE: IPL 2020 కోసం యూఏఈకి బీసీసీఐ ఎంత చెల్లించిందో తెలుసా ?

Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !

Also read : Coronavirus on packaged meat: మాంసంతో కరోనావైరస్.. చైనాకు కొత్తగా మరో టెన్షన్

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link