SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు
SBI Cuts Interest Rates: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను అలర్ట్ చేయడం, హెచ్చరించడంతో పాటు శుభవార్తలు సైతం అందిస్తుంది. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ఇటీవల కీలక ప్రకటన చేసింది.
బంగారం రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించినట్లు ప్రకటించింది SBI. మునుపెన్నడూ లేని విధంగా బంగారంపై అందించే రుణాలను తక్కవ వడ్డీరేట్లకే సొంతం చేసుకునేందుకు ఇది మంచి అవకాశం.
Also Read: SBI account holders: ఖాతాదారులకు ఎస్బీఐ బ్యాంక్ హెచ్చరిక.. లైట్ తీసుకుంటే మీ ఖాతా ఖాళీ..
బంగారం (Gold)తో చేయించిన ఆభరణాలతో పాటు గోల్డ్ కాయిన్లపై సైతం తమ కస్టమర్లకు కేవలం 7.5 శాతం వడ్డీతోనే రుణాలు అందివ్వనున్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ పేర్కొంది.
ఎస్‌బీఐ నుంచి బంగారంపై రుణాలు తీసుకోవడానికి ఎలాంటి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు బ్యాంకుకు సమర్పించాల్సిన లేదని తెలిపింది. లోన్ పరిమితిని రూ.50 లక్షల వరకు పెంచడం విశేషం. గతంలో కేవలం రూ.20 లక్షల వరకు మాత్రమే బంగారంపై రుణాలు లభించేవి.
Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?
18 ఏళ్లు నిండిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎవరైనా ఈ గోల్డ్ లోన్ తీసుకునేందుకు అర్హులేనని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఒకట్రెండు రాష్ట్రాల్లో ఇస్తున్న ఈ గోల్డ్ లోన్‌ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలకు బ్యాంకు అధికారులను సంప్రదించడం ఉత్తమం.
Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!