Sleeping Tips: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా, ఈ బ్రిటన్ ఫార్ములా పాటించి చూడండి, సుఖమైన నిద్ర రాకపోతే ఒట్టు
ది సన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం నిద్రకు సంబంధించిన నేషనల్ హెల్త్ సర్వీస్ రూపొందించిన ఈ ఫార్ములా ప్రకారం నిద్రించడానికి 10 గంటల ముందే కూల్ డ్రింక్స్, టీ-కాఫీలు మానేయాలి లేదా తగ్గించాలి. కెఫీన్ మరియు నిద్రకు సంబంధించి 36 గణాంకముందట. ఫలితంగా నిద్ర ఎగిరిపోతుంది. అందుకే రాత్రి 10 గంటలకు నిద్రపోయే సమయమైతే మద్యాహ్నం 12 తరువాత టీ, కాఫీలు తాగకూడదు.
నిద్రకు సంబంధించిన ఫార్ములాలో ఇది చివరిది. రాత్రి నిద్రించడానికి 1 గంట ముందు మీ గాడ్జెట్స్ అన్నీ కట్టేయాలి. అంటే మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ వంటివి క్లోజ్ చేసి బ్లూ స్క్రీన్ కు దూరంగా ఉండాలి. ఫలితంగా గ్యాడ్జెట్స్ నుంచి వెలువడే బ్లూ లైటింగ్ కారణంగా తలెత్తే కంటి నొప్పి ఉండదు. మంచి నిద్ర హాయిగా పడుతుంది.
రాత్రి నిద్రించడానికి 3 గంటల ముందు డ్రింక్స్ లేదా భారీ డైట్ తీసుకోకూడదు. దీనివల్ల శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సమయం లభిస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళ గ్యాస్ ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కాదు. ఇలా చేయడం వల్ల బెడ్ పైకి చేరిన కాస్సేపటి తరువాతే కళ్లు అలసిపోయి కాస్సేపటికే నిద్రపట్టేస్తుంది. మంచి డీప్ స్లీప్ పడుతుంది.
బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం రాత్రి నిద్రించడానికి సరిగ్గా 2 గంటల ముందే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లేదా రిలాక్సేషన్ లభిస్తుంది. ఫలితంగా మీ మస్తిష్కంలో నడిచే వివిధ విషయాలు పక్కకుపోతాయి. ఫలితంగా బెడ్ పైకి చేరగానే ఇళ్లు లేదా ఆఫీసుకు సంబంధించిన టెన్షన్ ఉండదు.
తక్షణం నిద్రనిద్రే '10-3-2-1' ఫార్ములాను బ్రిటన్ కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ రూపొందించింది. ఈ ఫార్ములాను అమలు చేస్తే ఏవిధమైన చికిత్స లేకుండానే 7-8 గంటలు మంచి నిద్ర పడుతుందంటున్నారు బ్రిటన్ వైద్యులు. పశ్చిమ దేశాలు ఇప్పుడీ ఫార్ములాను అనుసరిస్తున్నాయి.