Zodiac Signs Affected With Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం అధిక ప్రభావం!
Zodiac Signs Affected With Solar Eclipse 2020: ఖగోళ దృగ్విషయాలను పూర్వకాలం నుంచి విశ్వసిస్తున్నాం. చాలా మంది వీటికి ప్రాధాన్యత సైతం ఇస్తారు. అయితే తాజాగా ఏర్పడనున్న సూర్యగ్రహణం (Solar Eclipse 2020:) ఏ రాశులవారిపై ప్రభావం చూపనుంది, గ్రహణం ప్రభావం ఉండనుందా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో డిసెంబర్ 14న రాత్రి 07:03 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం (Solar Eclipse 2020) అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. అయితే చివరి సూర్యగ్రహణం 2020 ఎలా ప్రభావితం చేస్తుందనే అంచనాలను మీరు తెలుసుకోండి.
ఈ సమయంలో మీరు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా క్లిష్ట పరిస్థితులను మీ నైపుణ్యంతో చాలా తేలికగా అధిగమించే అవకాశం ఉంది. మీరు సుదీర్ఘకాలంగా మరచిపోయిన సమస్యలు మరోసారి మీకు చికాకు కలిగిస్తాయి. అయితే అలాంటి వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉంటే మంచిది. మీకు కావాల్సిన, మీరు ప్రేమించే వ్యక్తులతో కొన్ని విషయాలలో రాజీపడతారు.
Solar Eclipse 2020: మీరు గుర్తింపునకు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. గత కొన్ని నెలలుగా మీరు కావలసిన మార్పు కోసం తీవ్రంగా శ్రమించారు. మీ చుట్టుపక్కల పరిస్థితుల వల్ల మీరు చలించిపోతారు. కొన్ని సందర్భాలలో మీ మనసు గాయపడుతుంది, కాస్త కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు కష్టపడి పనిచేస్తే కచ్చితంగా మీ ఊహించిన ఫలితాలు రాకున్నా, ప్రయోజనం మాత్రం కనిపిస్తుంది.
మీ వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. కొన్ని అవకాశాలు మీ దారికి ఎదురైనా వాటిని మీరు ఆశించకుండా ముందుకు సాగిపోతారు. మీరు ఒత్తిడిలో ఎలా పని చేస్తారోనన్న నిఘా సైతం మీపై ఉండే అవకాశం ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఈ సమయంలో మీకు అంతగా కలిసిరాదు. మిథునరాశి వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రాశివారు విషయాలను బాగా ఆలోచించడం ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలని యత్నిస్తారు. మీ సమస్యల నుంచి దూరం వెళ్లడానికి ప్రయత్నించడం కుదరదు. మీరు తప్పుకోవడం మొదలుపెడితే మీ అవకాశాలు అంత తగ్గిపోయి, పరిస్థితి జఠిలం అవుతుందని గ్రహించాలి.
Also Read : Solar Eclipse 2020 Date and Timings: చివరి సూర్యగ్రహణం.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే!
మీరు వెళ్లే మార్గంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ పనిని పదే పదే ఆటంకాలు ఎదురవడంతో జాప్యం జరుగుతుంది. ఆలోచించకుండా మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి పనిలో ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరంగా కనిపిస్తోంది. ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయాలి. లేనిపక్షంలో మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందకపోవచ్చు. కానీ జరిగిన దాన్ని ఆలోచిస్తూ ఆగిపోకుండా మరోసారి ప్రయత్నించడం కొనసాగిస్తే మేషరాశి వారికి కాస్త మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి