Kidney Detox Fruits: కిడ్నీల్లోని టాక్సిన్స్ ను శుభ్రం చేసే 5 పండ్లు.. రెగ్యులర్‌గా తినండి..!

Mon, 22 Jul 2024-6:52 am,

దానిమ్మ: మన కిడ్నీలను డిటాక్స్‌ చేసి ఆరోగ్యకరంగా మార్చే పండ్ల జాబితాలో దానిమ్మ ఒకటి. ముఖ్యంగా ఇందులో కిడ్నీలో ఫాస్ఫేట్, ఆక్సలేట్, సిట్రేట్ ,కాల్షియం సమతుల్యం చేస్తుంది.కిడ్నీలు క్లీన్‌ చేయడంలో దానిమ్మ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.   

ఆరెంజ్ : సాధారణంగా ఆరెంజ్‌, నిమ్మరసం రెండిటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. ఈ సిట్రస్‌ పండ్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. సీజనల్‌ వ్యాధులు రాకుండా కాపాడతాయి.ఆరెంజ్ కిడ్నీలను శుభ్రపరచడంలో బాగా సహాయపడుతాయి.   

ద్రాక్ష: ద్రాక్షపండ్లు మూడు రంగులు ఉంటాయి. ఇవి కూడా సిట్రస్‌ పండ్లు. ద్రాక్ష కూడా కిడ్నీలను డిటాక్స్‌ చేసే ఆరోగ్యకరమైన పండ్లు. ముఖ్యంగా ఇందులో నేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాకుండా ఎర్ర ద్రాక్షలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ ద్రాక్ష పండ్లలో కిడ్నీ వాపును నిరోధించే ఫ్లేవనాయిడ్స్ ఇందులో ఉంటాయి.   

పుచ్చకాయ: కిడ్నీలను క్లీన్ చేసే మరో పండు పుచ్చకాయ. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయలోని లైకోపీన్ కిడ్నీ మంటను తగ్గిస్తుంది. ఈ పుచ్చకాయ మూత్రపిండాలను డిటాక్సిఫై చేసి, కిడ్నీల్లోని విషపదార్ధాలను బయటకు పంపించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.   

బెర్రీ: ముఖ్యంగా బెర్రీ జాతికి చెందిన పండ్లలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ,ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. కిడ్నీలను క్లీన్‌ చేసే ఎఫెక్టీవ్‌ రెమిడీ ఇందులో ఉన్నాయి. బెర్రీ పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link