Virat Kohli: దిగ్గజాలకే అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ.. గణాంకాలే సాక్ష్యాలు

Fri, 04 Dec 2020-9:43 am,

అంతర్జాతీయ క్రికెట్‌లో 22000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ కేవలం 462 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఇదే ఫీట్ చేరడానికి సచిన్‌కు 493 ఇన్నింగ్స్‌లు, బ్రియాన్ లారాకు 511 ఇన్నింగ్స్‌లు, రికీ పాంటింగ్‌క 514 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. ఏ పరంగా చూసిన విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాళ్ల కంటే మెరుగైన బ్యాటింగ్ సగటుతో పాటు ఛేజింగ్‌లో అద్భుత రికార్డులు కలిగి ఉన్నాడు. కెప్టెన్‌గానూ అత్యధిక సెంచరీల రికార్డును సైతం విరాట్ తన పేరిట లిఖించుకున్నాడు.

విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో ఇటీవల 12,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాయి. ఈ ఘనత సాధించడానికి కోహ్లీకి అవసరమైన ఇన్నింగ్స్‌లు కేవలం 242. ఇదే విషయానికొస్తే దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్యలకు ఎన్ని ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయో చూడండి.

సచిన్ 300 ఇన్నింగ్స్‌లలో 12000 వన్డే పరుగులు పూర్తిచేశాడు. అయితే అత్యంత వేగవంతంగా 12వేల వన్డే పరుగుల సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా ఉండే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 314 ఇన్నింగ్స్‌లలో 12000 వన్డే పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 72 తక్కువ ఇన్నింగ్స్‌లకే ఈ ఫీట్ సాధించాడు.

శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 336 వన్డే ఇన్నింగ్స్‌ల‌లో 12000 వన్డే రన్స్ పూర్తి చేశాడు. సంగక్కర కన్నా కోహ్లీ మరో 92 తక్కువ ఇన్నింగ్స్‌లకు ఈ ఫీట్ చేరుకున్నాడు. త్వరలోనే సంగక్కర వన్డే పరుగుల రికార్డును అధిగమిస్తాడు.

Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా!

శ్రీలం డాషింగ్ బ్యాట్స్‌మన్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 379 ఇన్నింగ్స్‌లలో 12000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. టాప్ 5 ఆటగాడిగా నిలిచాడు జయసూర్య. త్వరలోనే జయసూర్య వన్డే పరుగులను కోహ్లీ అధిగమించనున్నాడు.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link