Voter ID Updation: మీ ఓటర్ ఐడీలో తప్పులున్నాయా.. నిమిషాల్లో సరిదిద్దుకోండి
Voter ID Card Correction: మీ ఓటర్ ఐడీ కార్డులో వివరాలు సరిగా లేవా.. లేక ఏమైనా తప్పులున్నాయా? అయితే పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ ఇతరత్రా వివరాలను మీ ఓటర్ ఐడీ కార్డులో సరిచేసుకోవడానికి ఏ ఆందోళన అక్కర్లేదు. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో మీ Voter ID వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ మీ వివరాలు సరిదిద్దుకోండి.
Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు
Voter ID Correction: ఓటర్ ఐడీ కార్డులో తప్పుల్ని సరిచేసుకోవడానికి ముందుగా https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అందులో హోమ్ పేజీలో ఎడమవైపు Login/Register పైన క్లిక్ చేయాలి
మీరు ఇదివరకు లాగిన్ కాని వారైతే Register as New user పైన క్లిక్ చేయాలి. ఆపై మీ మొబైల్ నెంబర్ ఎంటర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Also Read: Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్
మీరు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది వెరిఫై చేశాక మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.
Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ
ఇప్పుడు మీరు ఓ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోగానే. మీ పేరిట అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత లాగిన్ చేయాలి. అనంతరం Click on Correction in Personal Details ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అనంతరం మీ స్టేట్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి
మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వివరాలతో పాటు మీ ఫొటో అప్‌డేట్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. సబ్మిట్ చేస్తే.. మీకు రిఫరెన్స్ ఐడీ వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడీ ద్వారా మీ ఓటర్ కార్డ్ అప్‌డేట్ చేస్తున్న అప్లికేషన్ స్టేటస్ వివరాలు మీ చేతిలో ఉంటాయి.
Also Read: How To Secure Whatsapp Chat: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్