Arogya Setu: ఆరోగ్యసేతుకు అరుదైన ఘనత
Arogya Setu App Users In India: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణను అదుపు చేయడానికి భారత ప్రభుత్వం లాంచ్ చేసిన ఆరోగ్య సేతు యాప్ ( Arogya Setu App ) మరో ఘనత సాధించంది. ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌గా అవతరించింది.
Most Downloaded User Tracing App: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణను అదుపు చేయడానికి భారత ప్రభుత్వం లాంచ్ చేసిన ఆరోగ్య సేతు యాప్ ( Arogya Setu App ) మరో ఘనత సాధించంది. ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌గా అవతరించింది. ఆరోగ్య సేతు యాప్‌ను జూలై 2020లోనే అత్యధికంగా 127 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని సెన్సార్ టవర్ రిపోర్ట్ ( Sensor Tower ) చేసింది. ఏప్రిల్ 2020లో 80.8 మిలియన్ల డౌన్‌లోడ్స్ సాధించగా..జూలై నాటికి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. యాపిల్ స్టోర్ ( Apple Store ), గూగుల్ ప్లే స్టోర్ ( Play Store ) నుంచి వీటిని సుమారు 127.6 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. Instagram Shop Page: షాపింగ్ ఫేజ్ లాంచ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్
ప్రపంచ వ్యాప్తంగా అనేక కాంట్రాక్ట్ ట్రేసింగ్ ( Contact Tracing ) యాప్స్ వినియోగిస్తుండగా...ఆరోగ్య సేతు అందులో ఎక్కువగా వినియోగించే యాప్‌గా మారింది. కాంట్రాక్ట్ ట్రేసింగ్ విధానాన్ని పాలో అయిన నాలుగో దేశం భారత్ కాగా.. ప్రతీ భారతీయుడు దీనిని వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఆరోగ్య సేతుతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన కోవిడ్‌సేఫ్ యాప్ ( CovidSafe App ) ను 4.5 మిలియన్ల సార్లు వినియోగించారు. మొత్తం ఆస్ట్రేలియా జనాభాలో 21.6 శాతం మంది వినియోగిస్తున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌లో ఆస్ట్రేలియా, టర్కీ, జెర్మనీ సరసన భారత్ నిలిచింది. ప్రస్తుతం భారత దేశంలో 12.5 శాతం మంది ఈ ఆరోగ్య సేతు యాప్ ( Arogya Setu App Users In India ) వాడుతున్నారు.
కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ గురించి సర్వే నిర్వహించిన సెన్సార్ టవర్.. ఇందు కోసం మొత్తం 14 దేశాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో ఆస్ట్రేలియా, టర్కీ, జెర్మనీ, భారత్, ఇటలీ, పెరు, జపాన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పిన్స్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న మొత్తం 1.9 బిలియన్ల జనభాలో కేవలం 173 మిలియన్ల మంది మాత్రమే కోవిడ్-19 ( Covid-19 App ) ట్రాకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery