Bengaluru Man Books Cab On Ola and Uber Gets Same Driver: మనలో చాలా మంది సొంత కార్లను వాడకం తగ్గించేస్తున్నారు. తప్పనిసరిగా ఫ్యామిలీతో కలిసి వెళ్లాల్సి వస్తేనే, కారును బైటకు తీసుకున్నారు. లేకుంటే ఏ ఓలా లేదా ఉబర్ యాప్ లను ఉపయోగించుకుని చక్కగా బైటకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఒక్కరే వెళ్లేందుంటే కొందరు బైక్ లపై కూడా వెళ్తుంటారు. ముఖ్యంగా కారును తీయడం వల్ల కొన్ని సందర్బాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కొందరు తమ కారు ట్రాఫిక్ లో చిక్కుకుని పోవడం డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తారు. అంతే కాకుండా..కొన్నిసార్లు కార్లకు, ఇతర వాహనాలు ఢీకొట్డడం, గీతలు పడటం వంటివి కూడా జరుగుంటాయి. దీంతో ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ఓలా, ఉబర్ లపై మాత్రమే ఎక్కువగా ఆధారపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..


ఇదిలా ఉండగా.. మనం చాలా సార్లు ఓలా లేదా ఉబర్ లలో కార్లను బుక్ చేస్తుంటాం. దేనిలో డబ్బులు తక్కుగా చూపిస్తే దాన్ని ఎంపిక చేస్తాం. కొందరు రైడ్ బుక్ చేయగానే.. ఫోన్ చేసి చార్జీలు అడిగి, వాళ్లు అనుకున్నంట డబ్బులు రాకుంటే, రైడ్ ను క్యాన్షిల్ చేస్తుంటారు. మరికొందరు తొలుత రైడ్ ను ఓకె చెప్పిన కూడా ఆ తర్వాత ఏవో కారణాలతో క్యాన్షిల్ చేస్తుంటారు. ఇదంతా రెగ్యులర్ గా జరిగేదే. అయితే.. బెంగళూరులోని ఓక ప్రయాణికుడికి కాస్తంత భిన్నమైన అనుభవం ఎదురైంది. దీన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వైరల్ గా మారింది.  


బెంగళూరుకు చెందిన ఒక రైడర్ తొలుత ఓలా బుక్ చేశాడు. ఎంత సేపటికి రైడ్ యాక్సెప్ట్ చేయకపోవడంతో, ఉబర్ యాప్ ఓపెన్ చేసిన దీనిలో రైడింగ్ కోసం చూశాడు. కొద్ది సేపటికి ఓలా లోని ఒక డ్రైవర్ నుంచి రైడింగ్ యాక్సెప్ట్ మెస్సెజ్ వచ్చింది. అప్పటికే ఉబర్ యాప్ నుంచి కూడా మెస్సెజ్ వచ్చింది. దీంతో అతను రెండు మెస్సెజ్ లను చూసి షాకయ్యాడు.


Read More: Viral Video: ఇదేం స్టంట్ రా నాయన.. ట్రైన్ రూఫ్‌ మీద పడుకుని 400 కిలోమీటర్ల జర్నీ.. వైరల్ వీడియో..


ఇద్దరు ఓకే పేర్లు, ఓకే నంబర్ కార్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఓకేసారి ఇలా రైడ్ లను యాక్సెప్ట్ చేయడం పట్ల సదరు బెంగళూరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు.ఆ తర్వాత తనకు ఎదురైన వింత అనుభం స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీన్ని చూసిన నెటిజన్లు.. సదరు వ్యక్తి రెండు యాప్ లు ఎలా ఉపయోగిస్తున్నాడో. అతను కూడా అలాగే.. రెండు రైడింగ్ లను యాక్సెప్ట్ చేసి ఉంటాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook