Tej Pratap Yadav Dreams Of Sri Krishna: దేవుడు కల్లోకి వచ్చాడంటే వారు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ భాగ్యం దక్కదు అని అంటుంటారు. కల్లోనూ దైవ దర్శనం అవడం అంటే అంతకంటే మహా భాగ్యం మరొకటి ఉండదు అని భావించే వాళ్లు కూడా లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే కల్లో దైవాన్నిచూసిన వారు దైవాంశసంభూతులే అని కూడా భావిస్తుంటారు. అయితే అలా జనం తనని కూడా దైవాంశసంభూడిగా భావిస్తారు అని అనుకున్నారో ఏమో కానీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ప్రస్తుత బీహార్ కేబినెట్ లో పర్యావరణం, అటవీ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తనకు కలలో శ్రీకృష్ణుడు కనిపించాడు అంటూ ట్విటర్ ద్వారా ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో దేవుడు కనిపించాడు అని చెప్పిన మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అంతటితో సరిపెట్టుకోలేదు.. తనకు కలలో దేవుడు కనిపించాడంటూ అందుకు సంబంధించిన లైవ్ వీడియో కూడా షేర్ చేసుకున్నారు. చూడ్డానికి అచ్చం సినిమాటిక్ గా ఉన్న ఆ వీడియో చూసి జనం మంత్రిగారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.



 


కలలో నేను మీ విశ్వరూపాన్ని చూస్తున్నానని.. తలపై కిరీటం, చేతుల్లో చక్రం, ఆయుధాలు ధరించిన నీ రుపాన్ని చూశానని పేర్కొంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 


ఈ వీడియోను పరిశీలిస్తే.. మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. నిద్రలో ఉండగా శ్రీకృష్ణుడు తన కలలోకి వచ్చినట్టుగా పోర్ట్‌ట్రే చేయడం చూడొచ్చు. ఉన్నట్టుండి షాక్ లోంచి తేరుకున్నట్టుగా ఉలిక్కిపడి నిద్రలోంచి లేచిన తేజ్ ప్రతాప్ యాదవ్.. అద్భుతమైన తేజస్సుతో ఉన్న ఆ భగవంతుడిని చూడటం తనకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 


విచిత్రం ఏంటంటే.. తేజ్ ప్రతాప్ యాదవ్ షేర్ చేసిన వీడియో మహా భారత టీవీ సీరియల్ నుంచి కంపైలేషన్ చేసిన ఫుటేజ్ కావడంతో నెటిజెన్స్ తమదైన స్టైల్లో స్పందించకుండా ఉండలేకపోతున్నారు. " ఆస్కార్ అవార్డ్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ తేజూ భయ్యా " అంటూ సెటైరిక్‌గా ఒక నెటిజెన్ ట్వీట్ చేశారు.



 


మరొక ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. సేమ్ టు సేమ్ శ్రీకృష్ణుడు నాకు హాట్ స్టార్‌లో కనిపిస్తున్నాడు అంటూ సెటైర్ వేశాడు. 



 


 



 


ఇదిలావుంటే, జితిన్ సింగ్ అనే మరో ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. " మీ నుంచి స్పూర్తి తీసుకుని తాను ఆ మహా శివుడిని కలలో చూశాను " అంటూ శివుడితో కల కన్నటువంటి వీడియోను పోస్ట్ చేశాడు. జితిన్ సింగ్ పోస్ట్ చేసిన వీడియో తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ట్రోల్స్‌ని పీక్ లెవెల్‌కి తీసుకెళ్లింది.


ఇది కూడా చదవండి : Rs 1 lakh Monthly Salary Job: మీకు మీమ్స్ చేయడం వచ్చా ? నెలకు లక్ష రూపాయల శాలరీ ఇచ్చే జాబ్ రెడీ


ఇది కూడా చదవండి : Oppo Find X6 Series Phone: ఒప్పో నుంచి మరో ఖతర్నాక్ ఫోన్.. అద్దిరిపోయే కెమెరా ఫీచర్స్


ఇది కూడా చదవండి : Airtel Recharge Plans 2023: ఒక రీచార్జ్ ప్లాన్.. మొత్తం ఫ్యామిలీకి ఫుల్ ఫన్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి OTTలకు Free సబ్‌స్క్రిప్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK