Airtel Recharge Plans 2023: ఒక రీచార్జ్ ప్లాన్.. మొత్తం ఫ్యామిలీకి ఫుల్ ఫన్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి OTTలకు Free సబ్‌స్క్రిప్షన్

Airtel Post Paid Recharge Plans: ఎయిర్‌టెల్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్. ప్రీపెయిడ్ కస్టమర్లను పోస్ట్‌పెయిడ్‌కు బదిలీ చేయాలనే ఆలోచనతో ఓ కొత్త ప్లాన్‌తో కస్టమర్స్ ముందుకొచ్చింది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఎయిర్‌టెల్ కస్టమర్స్ కోసం 105GB నుంచి 305GB ఇంటర్నెట్ డేటా వరకు వివిధ ఫ్యామిలీ ప్లాన్లను లాంచ్ చేసింది. 

Written by - Pavan | Last Updated : Mar 22, 2023, 03:26 PM IST
Airtel Recharge Plans 2023: ఒక రీచార్జ్ ప్లాన్.. మొత్తం ఫ్యామిలీకి ఫుల్ ఫన్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి OTTలకు Free సబ్‌స్క్రిప్షన్

Airtel Post Paid Recharge Plans for Family: ప్రస్తుతం కస్టమర్స్‌ని పెంచుకోవడం టెలికాం కంపెనీలకు ఒక పెద్ద టాస్క్ అయితే.. వచ్చిన కస్టమర్స్‌ని చేజారిపోకుండా చూసుకోవడం మరో పెద్ద టాస్క్‌గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆ సమస్యను అధిగమించేందుకు ఎయిర్‌టెల్ సరికొత్త ఐడియా వేసింది. ప్రీపెయిడ్ కస్టమర్స్‌ని పోస్ట్ పెయిడ్ చేసి శాశ్వతంగా ఎయిర్‌టెల్‌కి స్టికాన్ అయ్యేలా ఆఫర్స్ గుప్పిస్తోంది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న కొత్త ఫ్యామిలీ ప్లాన్స్ నెలకు రూ. 599 నుండి రూ. 1,499 వరకు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ ఫ్యామిలీ ప్యాక్‌లు DTH, బ్రాడ్‌బ్యాండ్ సేవతో నెలకు రూ. 799 నుండి రూ. 2,299 వరకు వివిధ టారిఫ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్

రూ. 599 రీచార్జ్ ప్లాన్
ఎయిర్‌టెల్ రూ. 599 పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌కు కస్టమర్స్ తమ కుటుంబసభ్యులని కూడా యాడ్ చేసుకోవచ్చు. వారికి 75GB డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది.

రూ. 999 రీచార్జ్ ప్లాన్

రూ. 999 రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్స్ ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్‌లు , 100GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ టారిఫ్ కింద కస్టమర్స్ తమ కుటుంబం నుంచి ఎవరైనా ముగ్గురుని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సభ్యత్వం కూడా లభిస్తుంది.

రూ. 1199 రీచార్జ్ ప్లాన్

ప్రజలు ₹ 1199 రీఛార్జ్ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్ కాల్స్ ప్లస్ 150GB డేటాను, ప్రతీరోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ టారిఫ్‌లో కూడా ముగ్గురు కుటుంబసభ్యులను యాడ్ చేసుకోవచ్చు. ఈ టారిఫ్ కింద కనెక్ట్ అయిన వారికి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వంటి ఓటిటిలకు సబ్ స్క్రిప్షన్ కూడా పొందొచ్చు.

రూ. 1499 రీచార్జ్ ప్లాన్

రూ. 1499 రీఛార్జ్ ప్లాన్‌లో, ప్రజలు 200GB డేటాతో పాటు ప్రతీ రోజూ 100 SMS లతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ టారిఫ్ కింద రీచార్జ్ చేసుకున్న వారు నలుగురు కుటుంబసభ్యులను యాడ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌కి యాక్సిస్ లభిస్తుంది.

ఇప్పటి వరకు ప్రీపెయిడ్ కస్టమర్లుగా ఉన్న వారిని పోస్ట్‌పెయిడ్‌ చేసి వారిని తమ శాశ్వత కస్టమర్స్‌గా మల్చుకోవడమే లక్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ సరికొత్త ఐడియాను అమలు చేస్తోంది. డిసెంబర్ 2022 త్రైమాసికంలో ఎయిర్‌టెల్ కంపెనీ మొత్తం 33.20 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్‌లలో 5.4 శాతం మంది పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్లుగా మార్చేసిందంటే.. ఈ బిజినెస్ ఆపరేషన్‌ని ఆ కంపెనీ ఎంత సీరియస్ గా తీసుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : WhatsApp Exclusive Feature: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. ఇకపై వారికి పండగే! 

ఇది కూడా చదవండి : 7 Seater SUV Car: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్

ఇది కూడా చదవండి : SBI Home Loans: ఎస్బీఐ హోమ్ లోన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News