Vahan Puja For Helicopter: యాదాద్రిలో అరుదైన దృశ్యం.. హెలీక్యాప్టర్‌కి వాహన పూజలు, వీడియో వైరల్
Helicopter Vahan Puja : సొంతంగా చాపర్ కొనుగోలు చేసిన ఓ బిజినెస్‌మేన్.. ఆ చాపర్‌లోనే గుడికి వెళ్లి హెలీక్యాప్టర్‌కి వాహన పూజలు చేయించాడు. ఆ వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి దృశ్యం ఇంతకు ముందెప్పుడూ చూడలేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Helicopter Vahan Puja : ఎవరైనా కొత్త టూ వీలర్ కొన్నప్పుడు, లేదా కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు తమకు బాగా నచ్చిన, నమ్మకం ఉన్న గుడికి వెళ్లి వాహన పూజలు చేయిస్తుంటారు. బస్సులు, లారీలు, జేసీబీ లాంటి భారీ వాహనాలకు కూడా వాహన పూజలు చేయడం చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా హెలీక్యాప్టర్‌ని దేవుడి గుడికి తీసుకెళ్లి వాహన పూజలు చేయడం ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. సొంతంగా హెలీక్యాప్టర్ కొనుగోలు చేసిన ఓ బిజినెస్‌మేన్.. ఆ హెలీక్యాప్టర్‌కి గుడి ముందుట వాహన పూజలు చేయిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. మన లక్ష్మీనర్సింహా స్వామి పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోనే. అన్నట్టు ఆ బిజినెస్‌మేన్ మైనింగ్ దిగ్గజం గాలి జనార్ధన్ రెడ్డినో లేక బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీనో కాదు.... ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని బోయినపల్లి శ్రీనివాస్ రావు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, మానుఫాక్చరింగ్, టెలికాం సెక్టార్స్‌లో వ్యాపారాలతో పాటు ఆస్పత్రులు, ఒక మెడికల్ కాలేజీ ప్రతిమ గ్రూప్ సొంతం. ఎయిర్ బస్ ఏసీహెచ్-135 హెలీక్యాప్టర్‌ని కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాస్ రావు.. ఆ హెలీక్యాప్టర్‌లోనే కుటుంబంతో సహా యాదాద్రికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ హెలీక్యాప్టర్ ఖరీదు 5.7 మిలియన్ డాలర్లు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపి అగ్రనేత విద్యాసాగర్ రావు కూడా ఈ వాహన పూజ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. బోయినపల్లి శ్రీనివాస్ రావు, విద్యాసాగర్ రావు ఒకరికొకరు బంధువులు కావడం వల్లే ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారని సమాచారం. వాహనపూజల అనంతరం అదే హెలీక్యాప్టర్‌లో యాదాద్రి ఆలయం చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతూ విహంగ వీక్షణం చేశారు.
ఇది కూడా చదవండి : Funny Memes: ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిస్థితిపై ఫన్నీ మీమ్స్ వైరల్.. చూసి నవ్వకుంటే ఒట్టు
ఇది కూడా చదవండి : Who is Rohit Sharma's wife: రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఎవరో తెలుసా ?
ఇది కూడా చదవండి : Train Ticket Charges: రైలు టికెట్లపై రాయితీలు నిజమేనా ? లేక ఊహాగానాలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook