Funny Memes: ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిస్థితిపై ఫన్నీ మీమ్స్ వైరల్.. చూసి నవ్వకుంటే ఒట్టు

Funny Memes Going Viral: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల కష్టాలు ఇలా ఉండగా.. ఇదే సందర్భాన్ని ఆసరాగా తీసుకుని మీమ్స్ చేసే వారు ఫన్నీ మీమ్స్ తయారు చేసి నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ మీమ్స్ చూసి నెటిజెన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

Written by - Pavan | Last Updated : Dec 15, 2022, 04:38 AM IST
Funny Memes: ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిస్థితిపై ఫన్నీ మీమ్స్ వైరల్.. చూసి నవ్వకుంటే ఒట్టు

Funny Memes Going Viral: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రద్దీ కారణంగా ఏర్పడిన గందరగోళం టి3 టర్మినల్ లో ఎంతటి అయోమయం సృష్టించిందో అందరం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దీంతో చెక్-ఇన్ కోసం ప్రయాణికులు 3-4 గంటలు ముందే విమానాశ్రయంలో ఉండాల్సిందిగా విమానాయాన సంస్థలు కూడా తమ కస్టమర్స్ కి సందేశాలు పంపిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఇలా గంటల తరబడి విమానాశ్రయానికి చేరుకోవాల్సి రావడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రయాణికులు తాము ముందుగానే ఎయిర్ పోర్టుకి చేరినప్పటికీ తాము తమ ఫ్లైట్ మిస్ అయ్యామని ఆందోళనకు దిగుతున్నారు. 

ప్రయాణికుల కష్టాలు ఇలా ఉండగా.. ఇదే సందర్భాన్ని ఆసరాగా తీసుకుని మీమ్స్ చేసే వారు ఫన్నీ మీమ్స్ తయారు చేసి నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ మీమ్స్ చూసి నెటిజెన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. 

 

ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిస్థితిపై ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ = ఫిష్ మార్కెట్ అని రాసుకొచ్చాడు. చిన్నపిల్లల మార్గంలో వెళ్తేనే గేట్స్ ని చేరడానికి 3.5 గంటలు పట్టిందని సదరు ట్విటర్ యూజర్ తెలిపాడు.

ఇదే విషయమై మరో ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ఉదయం 8 గంటల ఫ్లైట్ కోసం 6 గంటలకే విమానాశ్రయం చేరుకున్నానని.. అక్కడి పరిస్థితి చూస్తే కుంభమేళనా తలపించింది అని అభిప్రాయపడ్డాడు. చిన్నప్పుడు తప్పిపోయిన తోడబుట్టినోళ్లు కూడా ఇక్కడ కలుస్తారేమోనని అనిపించిందని అక్కడి రద్దీ పరిస్థితి గురించి ఛమత్కరించాడు.

 

సయంతన్ ఘోష్ అనే మరో ట్విటర్ యూజర్ కూడా తనదైన స్టైల్లో స్పందించాడు. వాష్ రూమ్ లో అద్దాల ముందు నిలబడి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి సంభాషణ గురించి రాస్తూ.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని.. తన ఫ్లైట్ కి మరో వారం రోజులు ఉన్నందున ఆలస్యం ఏమీ లేదని ఆశాభావం వ్యక్తంచేస్తున్నట్టు అందులో పేర్కొన్నాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏర్పడిన గందరగోళం గురించి ఇంతకంటే దారుణమైన ట్రోలింగ్ ఇంకెప్పుడూ, ఎవ్వరూ చేయరేమో అని నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు.

Trending News