Train Ticket Charges: రైలు టికెట్లపై రాయితీలు నిజమేనా ? లేక ఊహాగానాలా ?

Concessions on Train Ticket Charges: రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలు ఎంతవరకు వచ్చిందో తెలపాల్సిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన ఆర్‌టిఐ యాక్టివిస్ట్ చంద్ర శేఖర్ గౌర్ సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి ఒక పిటిషన్ దాఖలు చేశారు.

Written by - Pavan | Last Updated : Dec 12, 2022, 07:37 PM IST
  • రైలు టికెట్లపై రాయితీలు ఇస్తున్నట్టా ? లేక ఇవ్వనట్టా ?
  • రాయితీలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది
  • పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను రైల్వే శాఖ పట్టించుకోవడం లేదా ?
  • సీనియర్ సిటిజెన్స్‌కి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ ఒక నష్టంగా భావిస్తోందా ?
Train Ticket Charges: రైలు టికెట్లపై రాయితీలు నిజమేనా ? లేక ఊహాగానాలా ?

Concessions on Train Ticket Charges: న్యూఢిల్లీ: రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు అందించే రాయితీని పునరుద్ధరించినట్టుగా వస్తోన్న ఊహాగానాలపై భారతీయ రైల్వే స్పందించింది. సీనియర్ సిటిజెన్స్‌కి టికెట్లపై రాయితీలను పునరుద్ధరించే అంశాన్ని తోసిపుచ్చుతూ భారతీయ రైల్వే గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసింది. కరోనావైరస్‌ వ్యాప్తికి ముందు 58 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులకు 50% ఛార్జీల తగ్గింపు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40% తగ్గింపు వర్తించేది. గరీబ్ రథ్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, సువిధ, హమ్‌సఫర్ రైళ్లు వంటి కొన్ని రైళ్లు మినహా అన్ని రైళ్లలోనూ సీనియర్ సిటిజెన్స్ అయిన స్త్రీ, పురుషులు ఈ టికెట్ కన్సెషన్‌కి అర్హులుగా ఉండేవారు. 

అయితే, కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో మార్చి 19, 2020న రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్స్ సహా (నాలుగు కేటగిరీల దివ్యాంగులు మినహా, 11 కేటగిరీల రోగులకు మినహా) అన్ని వర్గాల ప్రయాణికులకు రైలు టిక్కెట్‌లపై అందించే రాయితీలను ఉపసంహరించుకుంటున్నట్టుగా సర్క్యులర్ జారీ చేసింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ రైళ్లో అనవసర ప్రయాణాలను నివారించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా రైల్వే శాఖ అప్పట్లో వివరణ ఇచ్చుకుంది.

రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలు ఎంతవరకు వచ్చిందో తెలపాల్సిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన ఆర్‌టిఐ యాక్టివిస్ట్ చంద్ర శేఖర్ గౌర్ సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ గౌర్‌కి ఇచ్చిన సమాధానంలో రైల్వే శాఖ స్పందిస్తూ " స్టాండింగ్ కమిటీ సిఫార్సులను సరిగ్గా పరిశీలించిన తరువాత తేలింది ఏంటంటే.. 2019-20 మధ్య కాలంలో అన్నిరకాల  ప్రయాణీకుల టిక్కెట్‌లపై 59,837 కోట్ల రూపాయల రాయితీని రైల్వే శాఖ ఇచ్చిందని.. మొత్తం టిక్కెట్ల ఛార్జీలలో ఇది 53% కి సమానం అని రైల్వే శాఖ స్పష్టంచేసింది. ప్రతీ ఏటా రాయితీల రూపంలో ఇస్తున్న మొత్తం రైల్వే శాఖకు నష్టంగా భావిస్తున్నట్టు స్పష్టంచేసిన భారతీయ రైల్వే.. ఆ నష్టాన్ని భరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, వికలాంగులు, రోగులు, విద్యార్థులకు వివిధ రకాల కేటగిరీల కింద రాయితీలు అందించే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది.

తాజాగా కోవిడ్-19 ఆంక్షలు సడలించి నెలలు గడిచిపోతుండటం.. భారతీయ రైల్వేలో ప్రయాణికుల రద్దీ సైతం పెరిగి సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో సీనియర్ సిటిజెన్స్ సహా గతంలో తరహాలోనే అన్ని రాయితీలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఆయావర్గాల ప్రయాణికుల నుంచి వినిపించింది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు సైతం పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయా ప్రశ్నలకు ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, "సీనియర్ సిటిజన్లకు రాయితీలను తిరిగి ప్రారంభించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు" అని స్పష్టంచేశారు. 
 
" సీనియర్ సిటిజన్స్‌కి కోవిడ్‌-19కి ముందు లభించే రాయితీలను కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీలోనైనా సమీక్షించి, సీనియర్ సిటిజెన్స్ డిమాండ్స్ పరిగణించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన, నిజంగా అవసరమైన సీనియర్ సిటిజన్స్ ఆ సౌకర్యం ఉపయోగపడుతుంది అని కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అయితే, రైల్వే శాఖకు మాత్రం వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించే ఆలోచనే లేదని భారతీయ రైల్వే ఆర్టీఐ కార్యకర్తకు ఇచ్చిన సమాధానంతో స్పష్టమైంది. 

రాయితీలు ఇవ్వకపోవడానికి తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ భారతీయ రైల్వే చేసిన మరో ప్రకటన ఏంటంటే.. రాయితీలు ఇచ్చినంత కాలం ఏడాదికి సగటున 1800 కోట్ల మేరకు రాయితీల రూపంలో భారతీయ రైల్వే నష్టపోయిందని.. రాయితీలను పరిమితం చేసిన ఏడాది.. అంటే 2020-21 లో రాయితీలు అందించిన మొత్తం 38 కోట్లకు పడిపోయిందని భారతీయ రైల్వే స్పష్టంచేసింది. మొత్తానికి సీనియర్ సిటిజన్స్‌కి రాయితీలను పునరుద్ధరించే ఆలోచనే లేదని రైల్వే శాఖ ప్రకటన చూస్తోంటే స్పష్టంగా అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి : Credit Card Rules: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మర్చిపోయి ఫైన్‌తో కడుతున్నారా.. ఇక నుంచి అంతా చేంజ్‌ జీరో ఫైన్..

ఇది కూడా చదవండి : Airtel Recharge: ఎయర్‌టెల్ రీచార్జ్‌తో అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్ ఉచితం

ఇది కూడా చదవండి : Pm Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News