Young Boy dancing very funnily at wedding: ట్రెడిషనల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్‌, ఫోక్ డాన్స్, బాంగ్రా డాన్స్, బెల్లి డాన్స్.. ఇలా ఎన్నో డ్యాన్స్‌లు మీరు ఇప్పటికే చూసే ఉంటారు. ఎన్ని డ్యాన్స్‌లు చూసినా.. మీరు ఇంకా చూడాల్సిన డ్యాన్స్‌లు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని డ్యాన్స్‌లు చాలా అద్భుతంగా అనిపిస్తే.. మరికొన్ని మాత్రం కడుపుబ్బేలా నవ్విస్తాయి. ఇప్పుడు రెండో రకానికి చెందిన ఒక ఫన్నీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో యువకుడి డాన్స్ చూస్తే మీరు షాక్ అవ్వడం పక్కా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ప్రకారం... ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లిలో డీజే పెట్టారు. స్టేజ్ కింద కొందరు అబ్బాయిలు డాన్స్ చేస్తుండగా.. పెళ్ళికి వచ్చిన అతిథులు కుర్చీలలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. డీజే సౌండ్‌కు ఓ యువకుడికి పూనకం వచ్చింది. ముందుగా కుర్చీపై కూర్చొని తలను అటూ ఇటూ ఊపాడు. కొన్ని సెకన్ల తర్వాత అతను తన కుర్చీపై లేచి విచిత్రమైన రీతిలో డాన్స్ చేశాడు. ముందు కుర్చీ ఉండడంతో కిందపడ్డాడు. అయినా కూడా తగ్గేదేలే అంటూ కిందపడి కూడా డాన్స్ చేశాడు. ఇది చూసిన అక్కడి వారు పడిపడి నవ్వుకున్నారు. 



ఈ వీడియోను videonation.teb పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి 'ఇంత ఎనర్జీ తప్పనిసరి' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియో చూసిన అందరూ యువకుడి డాన్స్ చూసి షాక్ అవుతున్నారు. వీడియోకి 5000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 'ఇదేందయ్యో ఇది.. ఇలాంటి డాన్స్ నేనెక్కడా చూడలే', 'యువకుడు మద్యం పుచ్చుకున్నాడు' అని కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: అచ్చు భక్తుల మాదిరిగానే.. దేవుడి ముందు మోకరిల్లిన మేక! ఏం ప్రార్థించిందో..


Also Read: బుమ్రా లేని భారత జట్టును అలానే చూస్తారు.. వ్యూహాలపై కూడా ప్రభావం చూపిస్తుంది: బంగర్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook