Goat Viral Video: అచ్చు భక్తుల మాదిరిగానే.. దేవుడి ముందు మోకరిల్లిన మేక! ఏం ప్రార్థించిందో..

Viral Video, Goat Kneeling Down At Temple during Aarti. అచ్చు మనుషుల మాదిరే.. ఓ మేక తన ముందరి కాళ్లతో ఆలయం ముందు మోకరిల్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 17, 2022, 01:09 PM IST
  • అచ్చు భక్తుల మాదిరిగానే
  • దేవుడి ముందు మోకరిల్లిన మేక
  • మేక ఏం ప్రార్థించిందో
Goat Viral Video: అచ్చు భక్తుల మాదిరిగానే.. దేవుడి ముందు మోకరిల్లిన మేక! ఏం ప్రార్థించిందో..

Goat Kneeling Down At Baba Anandeshwar Temple in Kanpur during Aarti: దేవుడిపై భక్తి మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే చాలా జంతువులు నిరూపించాయి. ఆవు, పాము, కుక్క లాంటి జంతువులు దేవుడిపై ఉండే భక్తి ఏదో రూపంలో తెలియజేశాయి. తాజాగా ఓ మేక దేవుడిపై ఉండే భక్తిని చాటుకుంది. భక్తులతో పాటు మేక కూడా తల వంచుకుని దేవుడ్ని ప్రార్థించింది. అంతేకాదు అచ్చు మనుషుల మాదిరే మేక తన ముందరి కాళ్లతో మోకరిల్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

గంగానది తీరంలోని పురాతన శివాలయంలోని శివుడిని 'బాబా ఆనందేశ్వర్‌'గా భక్తులు కొలుస్తారు. నిత్యం అక్కడ శివునికి ఉదయం, సాయత్రం పూజలు జరుపుతుంటారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. తాజాగా ఈ ఆలయంలోకి ఓ మేక వచ్చింది. తాజాగా పూజారులు సాయంత్రం వేళ శివుడికి హారతి ఇచ్చి మంత్రాలు చదువుతున్నారు. అక్కడి భక్తులు భక్తి తో దేవుడిని కొలుస్తున్నారు. కొందరు భక్తులు దేవుడి ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్నారు. 

ఆలయంలోకి భక్తులతో పాటు ఒక మేక కూడా ఎంతో శ్రద్ధగా శివుడిని పూజించింది. మేక తన ముందు కాళ్లతో ఆలయం మెట్ల వద్ద మోకరిల్లింది. హారతి పూర్తయ్యేవరకు మేక తల వంచి ప్రార్థన చేసింది. భక్తులు శివుడిని కొలిచినంత సమయం మేక కూడా ప్రార్ధించింది. ఇది చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

డేవిడ్ జాన్సన్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్‌ చేశారు. 'కాన్పూర్‌లోని పరమాత్మ ఆలయంలో ఒక అద్భుతమైన భక్తి భావ చిత్రం. బాబా ఆనందేశ్వరుడికి హారతి ఇస్తున్న సమయంలో ఒక మేక భక్తితో మోకరిల్లింది' అని రాశుకొచ్చాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం ప్రార్థించిందో అని కెమెంట్స్ పెడుతున్నారు. 

Also Read: బుమ్రా లేని భారత జట్టును అలానే చూస్తారు.. వ్యూహాలపై కూడా ప్రభావం చూపిస్తుంది: బంగర్‌

Also Read: పటీదార్, త్రిపాఠికి నిరాశే.. ఆ ఒక్కడికి ఛాన్స్! మూడో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News