Car Fell Into Waterfall: చూస్తుండగానే కళ్లముందే వాటర్ ఫాల్స్‌లో పడిన కారు
Car Fell Into Waterfall In MP: జలపాతం పై భాగంలో అంచుల వరకు వచ్చిన ఓ రెడ్ కలర్ కారు ప్రమాదవశాత్తుగా అందులో పడిపోయింది. కారు నీళ్లలో పడిన సమయంలో అందులో తండ్రీకూతుళ్లు ఉన్నారు. నీళ్లలో పడిన కారుతో పాటే వారు కూడా మునిగిపోతూ గట్టిగా కేకలు వేయసాగారు.
Car Fell Into Waterfall In MP: సోషల్ మీడియాలో మనకు నిత్యం నమ్మశక్యం కాని ఎన్నో చిత్ర విచిత్రమై ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో భాగంగానే రెండు అంతస్తులు ఇంటిపైకి ఒక కారు దూసుకుపోవడం నిన్న చూశాం కదా.. తాజాగా ఓ కారు జలపాతంలో పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి 60 కిమీ దూరంలో ఉన్న లోధియా కుండ్ జలపాతం వద్ద గత ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.
జలపాతం పై భాగంలో అంచుల వరకు వచ్చిన ఓ రెడ్ కలర్ కారు ప్రమాదవశాత్తుగా అందులో పడిపోయింది. కారు నీళ్లలో పడిన సమయంలో అందులో తండ్రీకూతుళ్లు ఉన్నారు. నీళ్లలో పడిన కారుతో పాటే వారు కూడా మునిగిపోబోతుండగా.. వెంటనే అక్కడున్న పర్యాటకులు నీళ్లలోకి దూకి ఈత కొట్టుకుంటూ వెళ్లి వారిని బయటికి తీసుకొచ్చి రక్షించారు.
అది ఆదివారం కావడంతో లక్కీగా అక్కడ చాలామంది పర్యాటకులు ఉండటం.. అందులో కొంతమంది వేగంగా స్పందించి, ప్రాణాలకు తెగించి వారిని రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే తండ్రీ కూతుళ్లు ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఆ సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఘటనలో తండ్రిని కాపాడిన సుమిత్ మాథ్యూ అనే వ్యక్తి పీటీఐతో మాట్లాడుతూ.. తాము చూస్తుండగానే తమ కళ్ల ముందే ఈ ఘటన జరిగిందని.. కారు నీళ్లలో పడేటప్పుడు దానిని కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని తెలిపాడు. నీళ్లలో పడిన కారులో తండ్రీ కూతురు ఇద్దరూ బిగ్గరగా కేకలు వేయసాగారు. వెంటనే తను ఒకవైపు నుంచి వెళ్లి తండ్రిని కాపాడాను. అదే సమయంలో ఇంకొంతమంది పర్యాటకులు అవతలి వైపు నుండి వెళ్లి కారులో ఉన్న 13 ఏళ్ల చిన్నారిని కాపాడారు. ఈ ప్రమాదం కళ్లారా చూసిన నాకు కొద్దిసేపటి వరకు ఆ షాక్ లోంచి తేరుకోలేకపోయాను. ఏదైతేనేం.. అదృష్టవశాత్తుగా ఆ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు అని సుమిత్ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : Rare Accident : గాల్లోకి ఎగిరి ఇంటి పై కప్పుని ఢీకొట్టిన కారు
కారు జలపాతంలో పడిన ఘటనపై జిల్లా ఎస్పీ సునీల్ మెహతా స్పందిస్తూ.. ఇది పూర్తిగా కారు డ్రైవింగ్ చేస్తున్న వారి నిర్లక్ష్యం వల్లే జరిగింది అని అర్థం అవుతోంది అని అన్నారు, వర్షాకాలం కావడంతో జలపాతం చూసేందుకు అక్కడికి చాలామంది పర్యాటకులు వచ్చారని.. అదృష్టవశాత్తుగా వాళ్లే వీరిని రక్షించారు అని సునీల్ మెహతా తెలిపారు. పర్యాటక ప్రదేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Independence Day 2023 Long Weekend: అన్నీ మర్చిపోయి సరదాగా తిరిగొద్దాం రండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి