Viral Video: కళ్లు తెరిచి మూసేలోగా రంగు మారుస్తున్న చేప..వీడియో చూడండి..!
Color Changing Fish Video: నెట్టింటా ఎన్నో వైరల్ వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. ఇందులో పాముల వీడియోలు కోకొల్లలు. అయితే, మేమేం తక్కువా? అన్నట్లు ఈసారి ఓ చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Color Changing Fish Video: నెట్టింటా ఎన్నో వైరల్ వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. ఇందులో పాముల వీడియోలు కోకొల్లలు. అయితే, మేమేం తక్కువా? అన్నట్లు ఈసారి ఓ చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు రంగులు మార్చేది ఊసరవెల్లి అని మనం అనుకుంటాం. కానీ చేప కూడా రంగులు మారుతుందంటే మీరు నమ్ముతారా?
సోషల్ మీడియాల వల్ల ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మన ఇంట్లో కూర్చొనే చూడగలుగుతున్నాం. ఈరోజు మనం ఓ వైరల్ వీడియోను చూద్దాం. ఈ వీడియోలో చేప కన్ను తెరిచి మూసిన సెకన్లలోనే రంగులు మారుస్తోంది. ఇప్పటి వరకు రంగులు మార్చే ఊసరవెల్లిని చూశారు ఇప్పుడు చేపను కూడా చూడండి మరి.. ఈ వైరల్ వీడియోలో మీరు ప్రతి సెకనుకు చేప తన రంగును ఎలా మారుస్తుందో చూడవచ్చు. ఇది చూసిన ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
ప్రకృతి అన్ని జీవులకు వివిధ రూపాలు, విభిన్న సామర్థ్యాలను కూడా ఇచ్చింది. ఏదైనా జీవి మన ముందు కాస్త వింతైన పని ఏం చేసినా ఆశ్చర్యపడి మరి చూస్తాం. ప్రస్తుతం అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి సెకనుకు రంగు మారుతున్న చేపల వీడియో వైరల్‌గా మారుతుంది. ఈ ప్రత్యేకమైన చేప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో నిజమేనా? మన కళ్లు మోసం చేస్తున్నాయా? అనుకుని మళ్లీ మళ్లీ వీడియోను చూస్తున్నారు.
ఇదీ చదవండి: Lemon in Auction: వేలంలో రూ.1.5 లక్షలు పలికిన నిమ్మకాయ.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బాక్సులో నీళ్లు నింపిన చేపను చూడొచ్చు. ఇది ఇతర చేపల మాదిరిగానే నీటిలో ఈత కొడుతోంది.. దాంతోపాటు ప్రతి సెకనుకు తన రంగులు కూడా మారుస్తోంది. వీడియోలో మొదట్లో మీరు చేపల రంగు స్కై బ్లూ చూస్తారు. ఆ తర్వాత పసుపు రంగులోకి మారుతోంది. ఈ చేపను టెయిల్ ఫిష్ లేదా ఫ్లాషింగ్ ఫిష్ అని పిలుస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook