Daughter Robs Father House: సాధారణంగా చిన్నతనంలో కొందరు పిల్లలు ఎక్కువగా పొస్సెస్సివ్ గా ఫీల్ అవుతుంటారు. ఇద్దరు అన్నతమ్ముళ్లు లేదా అక్కా చెల్లెళ్లు అంటే ఇంకా.. గొడవలు పడుతుంటారు. తమనే ఎక్కువగా ప్రేమగా చూడాలని, ఏంకావాలన్న కొనివ్వాలని కోరుకుంటారు. కానీ అమ్మానాన్నలు.. పిల్లలను ఎప్పుడు కూడా ఒకేలా చూస్తుంటారు. కేవలం చిన్నతనం వల్ల పొస్సెస్సివ్ గా ఫీలవుతుంటారు. కొన్నిసార్లు ఈ చిన్న సంఘటనలు కాస్త పెద్ద గొడవలకు కూడా దారితీస్తుంటాయి. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Kajal Agarwal: రచ్చ రేపుతున్న కాజల్ అగర్వాల్.. మోడరన్ స్టిల్స్ కి ఫ్యాన్స్ ఫిదా..


ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కమలేష్ తన భర్త, కూతుళ్లతో కలిసి ఉంటుంది. అయితే..  అక్కా చెల్లెళ్లిద్దరికి కొంత  గొడవలు జరిగేవి. ఎప్పుడు కూడా చెల్లెలికే ఎక్కువగా సపోర్ట్ చేస్తారని, ప్రేమతో చూస్తారని అక్కా శ్వేత కోపంతో ఉండేది. ఈ క్రమంలో శ్వేత ఇంట్లో నుంచి గొడవ పడి బైటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకు తల్లిదండ్రులు ఆమె బైట ఇల్లు కొనుక్కొవడానికి సహయం చేశారు. అయితే... ఆమె చెల్లెలు ఉద్యోగం కూడా చేసేది. అది కూడా శ్వేతకు నచ్చేది కాదు. అప్పుడు.. ఎలాగైన ఇంట్లోని డబ్బులు, మాయం చేయాలని ప్లాన్ వేసింది.


ఇంకా.. శ్వేతకు కొంత అప్పుకూడా ఉంది. జనవరి 30న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని తన ఇంట్లో చోరీకి శ్వేత ప్లాన్ వేసింది. తన తల్లి మార్కెట్ కు వెళ్లడం గమనించింది. ఇదే అదనుగా భావించి మెల్లగా బురఖా ధరించి .. 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య ఇంట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత.. తన ఇంటి నుంచి లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ₹ 25,000 నగదు తీసుకుని జారుకుంది. మార్కెట్ ను వచ్చాక డోర్ తాళాలు తెరిచి ఉండటంతో వస్తువులు చిందర వందరగా ఉండటం చూసింది. వెంటనే షాక్ కు గురై పోలీసులకు సమాచారం ఇచ్చింది.


Read More: Masala Chai: మసాలా చాయ్ ఇప్పుడు ప్రపంచంలో 2వ బెస్ట్‌ డ్రింక్‌, దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే..


అదే విధంగా కూతురుకు కూడా చెప్పింది. ఆమె ఏం తెలవదన్నట్లు అమాయకంగా వచ్చింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆ తర్వాత పెద్ద కూతురు శ్వేతను అదుపులోకి తీసుకుని తమ దైన స్టైల్ లో విచారణ జరిపారు. అప్పుడు శ్వేత చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ కు గురయ్యారు. తనకన్నా.. చెల్లెలినే ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఇలా చేశానని చెప్పింది. చిన్నతనం నుంచి తల్లిదండ్రులపై ఈ విషయంపై తనకు కోపం ఉందని కూడా చెప్పుకొచ్చింది. పోలీసులు బంగారం, నగదును రికవరీ చేశారు.  ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook